నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
విజయనగరం అర్బన్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలని చెప్పారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించి స్లిప్పును తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కారమైనపుడు ఫోన్‌కి మెసేజ్ వస్తుందని, అర్జీదారులు వారి ఫోన్ చెక్ చేసుకోవచ్చన్నారు. నోటీసులు, ఎండార్స్‌మెంట్‌ను వాట్సాప్‌లో అందజేస్తు న్నామని, ఎండార్స్‌మెంట్‌ను రిజస్టర్ పోస్ట్ ద్వారా సంబంధిత చిరునామాకు పంపిస్తున్నామని చెప్పారు. అర్జీ ఇచ్చేటప్పుడు దానిని కరెక్ట్‌గా పూరించాలన్నారు. రిపీటెడ్ అర్జీదారులు పాత రసీదును తీసుకురావాలని అన్నారు.
కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలి
అర్జీదారులు మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి ‘మీ కోసం.ఏపీ.జీఓవి.ఐఎన్’ వెబ్‌సైట్‌ను సంప్రదింవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమ్యలను పరిష్కారం పొందాలని విజ్ఞప్తి చేశారు.


