ఇందువదన..కుందరదన | - | Sakshi
Sakshi News home page

ఇందువదన..కుందరదన

Dec 8 2025 7:32 AM | Updated on Dec 8 2025 7:32 AM

ఇందువ

ఇందువదన..కుందరదన

ఇందువదన..కుందరదన

చీపురుపల్లి: అదో పల్లెటూరు. అక్కడ పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించిన అమ్మాయి దేశ స్థాయిలో జరిగే 42వ టెన్నికాయిట్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించింది. చీపురుపల్లి మండలంలోని పెదనడిపల్లి గ్రామానికి చెందిన కిలారి ఇందు పదో తరగతి చదువుతోంది. ఇప్పటికే జాతీయస్థాయిలో జరిగే టెన్నికాయిట్‌ చాంపియన్‌షిప్‌లో ఎన్నో బంగారు పతకాలు సాధించింది. ఇందుకు చిన్న వయస్సు నుంచే టెన్నికాయిట్‌పై ఆమెకు ఉన్న ఆసక్తిని గమనించిన ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు రామారావు నాణ్యమైన తర్ఫీదు ఇచ్చి మట్టిలో మాణిక్యాన్ని వెలికితీశారు. దీంతో ఇందు కోచ్‌ రామారావు వద్ద అకుంఠిత దీక్షతో శిక్షణ పొందుతోంది.

వ్యవసాయ కుటుంబంలో పుట్టి

కిలారి ఇందు మండలంలోని పెదనడిపల్లి గ్రామంలో వ్యవసాయ వృత్తిలో ఉన్న గొల్ల, భారతి దంపతుల కుమార్తె. అదే గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు టెన్నికాయిట్‌ క్రీడలో రాణిస్తోంది. నవంబర్‌ 26 నుంచి 30 వరకు జమ్ముకశ్మీర్‌లో జరిగిన 42వ జాతీయ టెన్నికాయిట్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ తరఫున పాల్గొన్న ఇందు ఉత్తమ ప్రతిభ కనపిరిచి బంగారు పతకం సాధించింది.

కోచ్‌ రామారావు ప్రత్యేక శ్రద్ధతో

పెదనడిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు రామారావుకు క్రీడల పట్ల ఎంతో ఆసక్తి ఉంది. దీంతోనే పల్లెటూరిలో చదువుతున్న పిల్లలను చక్కగా తీర్చిదిద్దుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో రాణించే దిశగా తర్ఫీదు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కిలారి ఇందు టెన్నికాయిట్‌లో జాతీయస్థాయిలో ప్రతిభ చూపి బంగారు పతకం సాధించింది.

రాష్ట్ర, జాతీయ స్థాయిలో సాధించిన పతకాల ఇందు

అంతర్జాతీయ స్థాయిలో

విజేతగా నిలవాలి

కేరళలో 2027లో జరగనున్న అంతర్జాతీయ టెన్నికాయిట్‌ చాంపియన్‌షిప్‌లో భారతదేశం తరఫున పాల్గొని విజేతగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. దీనికి కోచ్‌ రామారావు ప్రోత్సాహం పూర్తిగా ఉంది. ఆయన శిక్షణతోనే జాతీయ స్థాయి వరకు ఆడగలిగాను. అంతర్జాతీయ స్థాయిలో విజేతగా నిలవడమే కాకుండా పోలీస్‌ ఆఫీసర్‌ అవడమే నా లక్ష్యం.

కిలారి ఇందు, జాతీయ క్రీడాకారిణి, పెదనడిపల్లి

పల్లెలో మెరిసినన ‘బంగారుతల్లి’

పేదింటిలో పుట్టి ఆటల్లో దేశస్థాయిలో గుర్తింపు

మట్టిలో మాణిక్యాన్ని తీర్చిదిద్దిన కోచ్‌ రామారావు

టెన్నికాయిట్‌లో రాణిస్తున్న ఇందు

అంతర్జాతీయ పోటీలకు సిద్ధం

ఇందువదన..కుందరదన1
1/3

ఇందువదన..కుందరదన

ఇందువదన..కుందరదన2
2/3

ఇందువదన..కుందరదన

ఇందువదన..కుందరదన3
3/3

ఇందువదన..కుందరదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement