6,173 మంది అనుమానితులు గుర్తింపు
● గతనెల 17 నుంచి ఇంటి సర్వే చేస్తున్న వైద్యసిబ్బంది
● కుష్ఠువ్యాధి
అనుమానితులు
6,173 మంది
విజయనగరం ఫోర్ట్:
సమాజాన్ని కుష్ఠు వ్యాధి పీడిస్తూనే ఉంది. జిల్లాలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్న వ్యాధిపై వైద్యసిబ్బంది ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇంటింటి సర్వేతో అనుమానితులను గుర్తిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపిస్తున్నారు. వ్యాధి భారిన పడిన వారికి అవసరమైన ముందులు ఉచితంగా అందజేస్తున్నారు. కుష్ఠువ్యాధి మచ్చలు ఉన్నప్పటికీ అవి సాధారణ మచ్చలు అనుకుని చాలా మంది పట్టించుకోవడంలేదని, దీనివల్లే కేసులు నమోదవుతున్నట్టు వైద్యవర్గాలు చెబుతున్నాయి.
చురుగ్గా సర్వే..
జిల్లాలో ఉన్న జనాభా అంతటిని సర్వే చేయాలని వైద్యశాఖ నిర్ణయించింది. గత నెల 17 నుంచి ఆశ వర్కర్, వైద్యసిబ్బంది కలిసి ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. స్శర్శ, నొప్పిలేని మచ్చలు ఏమైనా ఉన్నాయా? లేదా? అన్నది పరిశీలిస్తున్నారు. కుష్ఠువ్యాధి అనుమానితులను పీహెచ్‌సీకి తీసుకెళ్లి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. జిల్లాలో 19,72,666 మందిని సర్వే చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 18,12,284 మందిని సర్వే చేశారు.
ఈ నెలాఖరు వరకు సర్వే
కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు గత నెల 17 నుంచి ఈ నెల 31వరకు సర్వే చేస్తాం. ఇప్పటి వరకు 6,173 మంది అనుమానితులను గుర్తించాం. ఇందులో 21 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. కుష్టు వ్యాధి నిర్ధారణ అయిన వారికి వెంటనే చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ కె.రాణి,
జిల్లా కుష్టువ్యాధి నియంత్రణ అధికారి
21 మందికి
కుష్ఠు వ్యాధి
నిర్ధారణ
3,852
మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు
వైద్య సిబ్బంది చేపట్టిన సర్వేలో జిల్లా వ్యాప్తంగా 6,173 మంది అనుమానితులను గుర్తించారు. వీరిలో 3,852 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 21 మందికి కుష్టు వ్యాధి నిర్ధారణ అయింది. ఇంకా 2,321 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉంది. వీరిలో కూడ కొంతమందికి వ్యాధి నిర్ధారణ అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కుష్టు వ్యాధి నిర్ధారణ సకాలంలో జరిగి సక్రమంగా మందులు వాడితే వ్యాధి నయమవుతుందని, అంగవైకల్యం బారిన పడకుండా ఉండవచ్చన్నది వైద్యుల మాట.
6,173 మంది అనుమానితులు గుర్తింపు


