ఎప్పటికప్పుడే ధాన్యం తరలింపు
● జేసీ సేతుమాధవన్
విజయనగరం ఫోర్ట్: రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలిస్తున్నామని జేసీ ఎస్.సేతుమాధవన్ తెలిపారు. సేకరించిన ధాన్యానికి సంబంధించి రైస్ మిల్లర్లు ఇవ్వాల్సిన సీఎంఆర్‌కు డెలివరీ చేసే కార్యక్రమాన్ని కె.ఎల్.పురం ఎస్‌డబ్ల్యూసీ గోదాములో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి 13,017 మంది రైతులకు రూ.140 కోట్లు చెల్లించామన్నారు. కార్యక్రమంలో సివిల్ సప్‌లై డీఎం బి.శాంతి పాల్గొన్నారు.


