ఘనంగా హోంగార్డ్స్ 63వ ఆవిర్భావ దినోత్సవం
● డీపీఓ నుంచి మహిళా పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ, మానవహారం
విజయనగరం క్రైమ్: శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డ్స్ సేవలు క్రియాశీలకమని ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ మేరకు శనివారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో హోంగార్డ్స్ 63వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై, హోంగార్డ్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించి, పోలీసుశాఖకు, ప్రజలకు హోంగార్డ్స్ అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థలో హెూంగార్డ్స్ అంతర్గత భాగమన్నారు. పోలీసులు నిర్వహించే అన్ని రకాల విధులను నిర్వహిస్తూ, పోలీస్‌శాఖలో క్రియాశీలకంగా మారారన్నారు. హోం గార్డులు నీతి, నిజాయితీ, అంకితభావంతో, క్రమశిక్షణతో పని చేసి జిల్లా పోలీసుశాఖకు మంచి పేరు తీసుకుని రావాలని, తద్వారా రాష్ట్ర పోలీసుశాఖకు కూడా మంచి కీర్తిని తీసుకు వచ్చే విధంగా పని చేయాలని సూచించారు. అనంతరం, విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన హెూంగార్డ్స్‌కు, పరేడ్ నిర్వహణలో ప్రతిభకనబర్చిన హోంగార్డ్స్‌కు ఎస్పీ బహుమతులను ప్రదానం చేశారు. హెూంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కవాతు నిర్వహించగా, పరేడ్ కమాండర్‌గా ఎం.శివ సంతోష్ వ్యవహరించారు. హెూంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవానికి సూచికగా శాంతి కపోతాలను, బెలూన్స్‌ను ఎస్పీ ఏఆర్.దామోదర్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత ఎగురవేశారు.
నగరంలో ర్యాలీ
హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయం నుంచి నిర్వహించిన ర్యాలీని ఎస్పీ ఏఆర్.దామోదర్ పచ్చ జెండా ఊపి, ప్రారంభించారు. ఈ ర్యాలీ జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి దిశ పోలీస్ స్టేషన్ వరకు నిర్వహించి, మానవ హారంగా ఏర్పడి, హెూంగార్డ్స్ విధులు, సేవల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్ డీఎస్పీ ఈ.కోటిరెడ్డి, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యరెడ్డి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, సీఐలు ఆర్వీఆర్కే చౌదరి, ఈ.నర్సింహమూర్తి, సీహెచ్. సూరినాయుడు, బి.లక్ష్మణరావు, టి.శ్రీనివాసరావు, ఆర్‌ఐలు ఆర్.రమేష్ కుమార్, ఎన్.గోపాల నాయుడు, టి.శ్రీనివాసరావు, డీపీఓ ఏఓ పి.శ్రీనివాసరావు, కార్యాలయ పర్యవేక్షకులు లలితకుమారి, వెంకటలక్ష్మి, ఆర్‌ఎస్సైలు ముబారక్ అలీ, మంగలక్ష్మి, సూర్యనారాయణ, రామకృష్ణ, ఇతర పోలీను అధికారులు, హెూంగార్డ్స్ ఇన్చార్జ్ హెచ్‌సీలు డీఎస్‌ఎన్ రాజు, కె.శ్రీనివాసరావు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
పార్వతీపురంలో..
పార్వతీపురం రూరల్: హోం గార్డులు పోలీసు శాఖకు వెన్నెముక లాంటివారని, నేర పరిశోధన నుంచి బందోబస్తు వరకు వారి సేవలు అద్భుతమని ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి కొనియాడారు. 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో శనివారం పోలీస్ మల్టీఫంక్షన్ హాల్ గ్రౌండ్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు వేడుకల్లో కేవలం మూడు రోజుల శిక్షణతోనే పరేడ్‌ను నిర్వహించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన సిబ్బందికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, పార్వతీపురం ఏఎస్పీ మనీషారెడ్డి, డీఎస్పీ థామస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా హోంగార్డ్స్ 63వ ఆవిర్భావ దినోత్సవం


