ఆసియన్ యూత్ పారా గేమ్స్–2025కు ప్రేమ్‌చంద్
విజయనగరం: దుబాయ్ వేదికగా ఈనెల 7 నుంచి 14 వరకు జరగబోయే ఆసియన్ యూత్ పారా గేమ్స్‌కు విజయనగరం జిల్లాకు చెందిన పొట్నూరు ప్రేమ్ చంద్ ఎంపిక కావడం జిల్లాకు దక్కిన అరుదైన అవకాశమని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ ఆసియన్ యూత్ పారాగేమ్స్, ఆసియన్ గేమ్స్‌తో సమానమని అన్నారు. యూత్ ఆసియన్ గేమ్స్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి 8 మంది ఎంపిక కాగా వారిలో మన జిల్లాకు చెందిన ప్రేమ్‌చంద్ ఉండడంగర్వకారణమని అన్నారు. ఈ ఏడాది లక్నోలో జరిగిన నేషనల్ యూత్ పారా గేమ్స్ బ్యాడ్మింటన్ మెన్స్‌న డబుల్స్‌లో గోల్డ్, సింగిల్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలుచుకుని అంతర్జాతీయ చాంపియన్ షిప్‌కు ఎంపికయ్యాడని తెలిపారు. ప్రేమ్ చంద్ ఎంపిక పట్ల కలెక్టర్ రాం సుందర రెడ్డి, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా క్రీడాధికారి ఎస్. వెంకటేశ్వసరరావు అభినందనలు తెలియజేశారు. దుబాయిలో జరిగే చాంపియన్ షిప్‌లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు, రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని అకాంక్షించారు.
11 మంది సత్య కళాశాల విద్యార్థులు అగ్నివీర్‌కు ఎంపిక
విజయనగరం అర్బన్: భారత సైన్యం అగ్నిపథ్ కింద అగ్నివీర్ జనరల్ డ్యూటీ/టెక్నికల్ విభాగాల్లో పట్టణానికి చెందిన సత్య డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థులు 11 మంది ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ.సాయిదేవమణి శనివారం విడుదల చేసిన ప్రకనటలో తెలిపారు. ఎంపికై న విద్యార్థులను స్థానిక కళాశాల ప్రాంగణంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు అభినందించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ అగ్నివీర్ ఎంపిక ప్రక్రియలో చూపిన ప్రతిభను కళాశాల విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధ్యాపకులు, ఎన్‌సీసీ ఆఫీసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆసియన్ యూత్ పారా గేమ్స్–2025కు ప్రేమ్‌చంద్


