అంతర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్ జట్టు ఎంపిక
రాజాం సిటీ: అంతర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్ పోటీల్లో పాల్గొనే జేఎన్‌టీయూ జీవీ టేబుల్ టెన్నిస్ జట్టు ఎంపిక స్థానిక జీఎంఆర్ ఐటీలో చేపట్టామని పీడీ బీహెచ్ అరుణ్‌కుమార్ తెలిపారు. శనివారం చేపట్టిన ఈ ఎంపికకు జేఎన్‌టీయూ జీవీ అనుబంధ కళాశాలల నుంచి 20 మంది క్రీడాకారులు హాజరయ్యారన్నారు. వారిలో ప్రతిభ కనబర్చిన ఐదుగురు మెయిన్ ప్లేయర్స్, ముగ్గురిని స్టాండ్‌బైగా ఎంపిక చేశామని తెలిపారు. మెయిన్ ప్లేయర్స్‌గా ఎంపికై న వారిలో ఎంఎల్‌ఎస్ సౌజన్య (విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాల), రిజ్వానా (రఘు ఇంజినీరింగ్ కళాశాల), జి.ప్రసన్న (విజ్ఞాన్ కాలేజ్), జి.శ్రీజ, సీహెచ్ దేవీ హర్షిత (జీఎంఆర్ ఐటీ)లు ఉన్నారన్నారు. వారంతా ఈ నెల 9 నుంచి 11 వరకు విశాఖపట్నంలోని గీతం వర్సిటీలో జరగనున్న అంతర్ విశ్వవిద్యాలయాల పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ ఎంపికలు జేఎన్‌టీయూ జీవీ అబ్జర్వర్, సెలక్షన్ కమిటీ మెంబర్ డాక్టర్ పి.రమణ, విశాఖపట్నం టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ సభ్యుడు రోహిత్ సమక్షంలో జరిగాయన్నారు. జట్టు ఎంపిక పట్ల జీఎంఆర్ ఐటీ ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్, ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, స్టూడెంట్స్ డీన్ డాక్టర్ వి.రాంబాబు, ఎంపిక సిబ్బందిని అభినందించారు.


