అన్నక్యాంటీన్‌లో ఉడకని భోజనం
నెల్లిమర్ల: పట్టణంలోని అన్నక్యాంటీన్‌లో శనివారం ఉడికీ ఉడకనీ భోజనం వడ్డించారు. పొంగల్ బదులు వెజిటబుల్ బిర్యానీ, బంగాళాదుంప కూర, మజ్జిగ వడ్డించారు. వెజ్‌బిర్యానీ పూర్తిగా ఉడకలేదు.దీంతో భోజనం తిన్న పట్టణవాసులు నిర్వాహకులపై చిందులు వేశారు. ఉడికీ ఉడకనీ బిర్యానీ ఎలాపెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది తినకుండానే డస్ట్‌బిన్‌లో పడేశారు.ఇదే విషయమై నిర్వాహకులను సాక్షి ఫోన్‌లో సంప్రదించగా బిర్యానీ పూర్తిగా ఉడకలేదన్నది నిజమేనని ఒప్పుకున్నారు. మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూస్తామని చెప్పారు.
నిర్వాహకులపై పట్టణవాసుల చిందులు
అన్నక్యాంటీన్‌లో ఉడకని భోజనం


