కూరగాయల సాగుపై దృష్టిసారించాలి
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
విజయనగరం ఫోర్ట్: మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేందుకు కృషిచేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఉద్యానశాఖ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సీజనల్‌గా డిమాండ్ ఉన్న కూరగాయలు, ఆకు కూరల విస్తీర్ణం పెంపుపై ఉద్యానశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే మార్గాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి మండలంలో కనీసం 1000 ఎకరాల్లో ఉద్యాన పంటల అభివృద్ధి జరగాలన్నారు. కూరగాయాల సాగుకు వీలుగా రైతులకు బోర్‌ల సదుపాయం కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో ఉద్యానశాఖ డీడీ చిట్టిబాబు పాల్గొన్నారు.
‘ఉపాధి’ కల్పనలో
అలసత్వం తగదు
విజయనగరం అర్బన్: జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకం కింద 100 రోజుల పని కల్పనలో అలసత్వం తగదని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అన్నారు. పనుల కల్పనలో వెనుకబడిన మండలాల అధికారులపై శుక్రవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో అసహనం వ్యక్తంచేశారు. వంగర, మెంటాడ, జామి, వేపాడ, కొత్తవలస మండలాలు ప్రతి వారం ప్రగతి తగ్గుతుండడంపై నిలదీశారు. వెంటనే మెమోలు జారీ చేయాలని ప్రాజెక్టు డైరెక్టర్‌ను ఆదేశించారు. గుర్ల, విజయనగరం, ఎల్.కోట, రేగిడి, భోగాపురం మండలాల్లో నిర్దేశిత లక్ష్యాల సాధనకు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. రోజువారీ వేతనం రూ.300 కంటే తక్కువ రాకుండా చూడాలన్నారు.
● వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో నిర్వహించిన మరో టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్క్రబ్‌టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అనవసర ఆందోళన రాకుండా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
● జిల్లా అభివృద్ధి సూచికల్లో పలు శాఖలు వెనుకబడి ఉండడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. పరిశ్రమలు, మహిళా అండ్ శిశు సంక్షేమం, పోలీస్, ఫిషరీస్, పశుసంవర్థక, ఉద్యానవన శాఖలు తమ ప్రగతిని తక్షణం మెరుగుపరచుకోవాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగితాలపై మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో నిజమైన, రియలిస్టిక్ డేటాను సిద్ధం చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సీపీఓ బాలాజీ పాల్గొన్నారు.
కూరగాయల సాగుపై దృష్టిసారించాలి


