ఆసక్తి మేరకు ప్రోత్సహించాలి
● పీటీఎంలో ఎస్పీ దామోదర్
విజయనగరం క్రైమ్: విద్యార్థుల ఆసక్తిని గమనించి ఆయా రంగాల్లో ప్రోత్సహించాలని ఎస్పీ దామోదర్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సూచించారు. విజయనగరం కస్పా ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన పీటీఎంలో పాల్గొన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం పెంపొందేలా ఉపాధ్యాయులు బోధన సాగించాలన్నారు. విద్యార్థులకు మంచి నడత నేర్పాలన్నారు. టెక్నాలజీని మంచి విషయాలు తెలుసుకునేందుకు వినియోగించేలా ప్రోత్సహించాలన్నారు. గుడ్, బ్యాడ్ టచ్‌లపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను కోరారు. అనంతరం సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఎస్పీ తిలకించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు పెన్నులను బహుమతిగా అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్‌ఎం విశాలాక్షి, టూటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


