అట్టహాసంగా సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభం
● అలరించిన సినీ తారలు రితిక, నిధి అగర్వాల్
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రం వాకిట ప్రముఖ వస్త్ర వాణిజ్య సంస్థ ‘ిసీఎంఆర్ షాపింగ్ మాల్’ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. పార్వతీపురంలోని సౌందర్య జంక్షన్‌లో ఏర్పాటు చేసిన ఈ భారీ షోరూమ్‌ను స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎంఆర్ రాకతో జిల్లా ప్రాంత ప్రజల షాపింగ్ కష్టాలు తీరాయన్నారు. గతంలో శుభకార్యాల కోసం విశాఖ, విజయవాడ వెళ్లేవారని, ఇప్పుడు ఆ అవసరం లేకుండా అంతర్జాతీయ స్థాయి షాపింగ్ అనుభవం, ఉపాధి అవకాశాలు స్థానికంగానే లభించడం ఆనందదాయకమన్నారు. సంస్థ చైర్మనన్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా తెలుగు ప్రజల ఆదరణే తమ బలమని, సొంత మగ్గాలపై నేయించిన వస్త్రాలను ఫ్యాక్టరీ ధరలకే సామాన్యులకు అందిస్తున్నామని తెలిపారు. ‘వన్‌న్‌స్టాప్ ఫ్యామిలీ డెస్టినేషన్’గా అన్ని వర్గాలకు నచ్చేలా మాల్‌ను తీర్చిదిద్దామని డైరెక్టర్ మావూరి మోహన్ బాలాజీ పేర్కొన్నారు. ప్రారంభోత్సవంలో సినీ తారలు రితిక నాయక్, నిధి అగర్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వస్త్ర శ్రేణులను తిలకించి, తమ ఆటపాటలతో అభిమానులను ఉర్రూతలూగించారు.


