ఆర్థిక సాయం అందలేదు..
నా పేరు దివిలి శ్రీను. మాది మెంటాడ మండలం లోతుగెడ్డ. నేను రెండు ఎకరాల భూమి కౌలుకు చేస్తున్నాను. నాకు కౌలు కార్డు కూడా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం నాకు అన్నదాత సుభీభవ సాయం అందించలేదు. యూరియా కోసం కూడ తీవ్ర ఇబ్బంది పడ్డాం. జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పడు మాకు రైతు భరోసా అందేది. రైతును ఆదుకోని ప్రభుత్వం ఇప్పుడు రైతన్న కోసం అంటూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం నవ్వుతెప్పిస్తోంది. అధికారులు గ్రామానికి వస్తే నిలదీస్తాను.
రైతన్నకు గడ్డు పరిస్థితి
నా పేరు ఎ. శ్రీరామ్మూర్తి. మాది మెంటాడ మండలం. నేను రెండు రెండున్నర ఎకరాలు భూమి కౌలుకు చేస్తున్నాను. నాకు అన్నదాత సుభీభవ సాయం అందలేదు. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేశారు. దీనివల్ల బీమా ప్రీమియం చెల్లించుకోలేక కట్టలేదు. జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పడు ప్రభుత్వమే పంటల బీమా ప్రీమియం చెల్లించేది. విపత్తుల సమయంలో ఆర్థికంగా ఉపశమనం లభించేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రైతన్నకు గడ్డు పరిస్థితి.
ఆర్థిక సాయం అందలేదు..


