రైతు నడ్డి విరిచారు..
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులను భ్రమలో పెట్టి మోసం చేస్తూ వస్తోంది. మోంథా తుఫాన్ పంట లను ముంచేసినా రూపాయి పరిహారం అందించలేదు. ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు. పంట సాగుచేయాలంటనే భయం వేస్తోంది. – పడాల గజపతి,
భూదేవిపేట, గజపతినగరం మండలం
పత్తిరైతు చిత్తు
గజపతినగరం మండలం తమ్మారాయుడు పేట, ఎం. గుమడాం గ్రామాల్లో సుమా రు 350 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాం. మొంథా తుఫాన్ వర్షాలకు పంటంతా తడిసి ముద్దయింది. ఇప్పటివరకు ఏ ఒక్క రైతుకు పైసా సాయం అందలేదు. కష్టాల్లో ఉన్న రైతును ఆదుకోకుండా ‘రైతన్నా మీ కోసం’ అంటూ ఏదో ఉద్దరిస్తామంటూ కల్లబొల్లి కార్యక్రమాలతో కాలక్షేపం చేయడం చంద్రబాబు ప్రభుత్వానికి తగదు.
– ధనాన రామునాయుడు, తమ్మారాయుడు పేట, గజపతినగరం మండలం
రైతు నడ్డి విరిచారు..


