సమస్యలు అవే... సమీక్ష తీరూ అదే..
విజయనగరం అర్బన్:
కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమావేశం (డీఆర్‌సీ)లోనూ గత సమావేశంలో ప్రస్తావించిన అంశాలపైనే సమీక్షించారు. అభివృద్ధి, సంక్షేమంలో లోపాలు, అధికారుల నిర్లక్ష్యం, శాఖల మధ్య సమన్వయలోపం, రెవెన్యూ శాఖలో అవినీతి, వ్యవసాయ సంక్షోభం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. కాసేపు సభ్యుల వాదోపవాదాలతో పాలనా వైఫల్యాలు కొట్టుచ్చినట్టు కనిపించాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జరిగిన సమీక్షలో రైతులను దోచుకునే మిల్లర్లు, అవినీతిలో మునిగిన రెవెన్యూ శాఖ, మాతృ–శిశు మరణాలు, పదోతరగతి ఫెయి ల్యూర్ రేటు ప్రధానంగా నిలిచాయి. జిల్లాలోని రైతుల చెరకు ఉత్పత్తులపై వచ్చిన సమీక్షలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ చెరుకు మద్దతుధర ప్రకటన ముందు రైతులతో సమావేశం ఎందుకు పెట్టలేదని కేన్ అధికారిని నిలదీశారు. గతంలో జాయింట్ కలెక్టర్ సమక్షంలో సమావేశ నిర్వహించి ధరలను రైతులకు తెలియజేసేవారని, ఆ సంప్రదాయం ఇప్పుడు ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు. సంకిలి సుగర్ ఫ్యాకరీ నడవాలంటే కనీసం 3 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు ఉత్పత్తి అవసరమని, ఆ స్థాయిలో రైతుల సాగు విస్తీర్ణం కోసం వ్యవసాయశాఖ లక్ష్యాలు ఏర్పరచుకోలేదని వ్యాఖ్యానించారు. తోటపల్లి కుడి కాలువ విస్తరణ కోసం గత సమావేశంలో రూ.32 కోట్లతో ప్రతిదానలు చేసినా నిధులు విడుదల కాలేదని, భూసేకరణ పనులు జరగలేదని ప్రస్తావించారు. దీనిపై మంత్రి అనిత స్పందిస్తూ వచ్చే సమావేశానికి పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఈ ఏడాది బొబ్బిలి ప్రాంతాల్లో అధిక విస్తీర్ణంలో సాగుచేసిన సంపద స్వర్ణ రకం ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ అధికారులను కోరారు. మొక్కజొన్న సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెరిగిందని, ఆ మేరకు కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచాలన్నారు. అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గుతున్న విషయంపై ప్రభుత్వం దృష్టి పెటాలని విజ్ఞప్తిచేశారు.
● ఎమ్మెల్సీ డాక్టర్ సూర్యనారాయణరాజు (సురేష్‌బాబు) మాట్లాడుతూ నెల్లిమర్ల ప్రాంతానికి ధాన్యం కొనుగోలు కోసం గోనె సంచలు పంపిణీ కావడం లేదని, దీనివల్ల రైతులు బయట కొనుగోలు చేయాల్సి వస్తోందని సమావేశంలో ప్రస్తావించారు.
● ధాన్యం కొనుగోలులో మిల్లర్ల దందా చేస్తున్నారని, రైతుల నుంచి ఐదు కిలోల వరకు రైతుల నుంచి ధాన్యం దోచుకుంటున్నారని నేరుగా కాల్ సెంటర్‌కే వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ధాన్యం కొనుగోల వ్యవస్థ నిర్వహణపై ఇన్‌చార్జ్ మంత్రి సీరియన్ అయ్యారు. మరోసారి ఇలాంటి ఫిర్యాదులు వస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో రెవెన్యూ లో మ్యుటేషన్ల అంశంలో అవినీతి ఎక్కువగా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని, కింది స్థాయి నుంచి ప్రక్షాళన చేయాలని, ఈ క్రమంలో కలెక్టర్ ఏ చర్యలు తీసుకున్నా పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించారు. సమావేశంలో కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి, జేసీ ఎస్.సేతుమాధవన్, ఎంఎస్‌ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు రఘురాజు, కావలి గ్రీష్మ, ఎమ్మెల్యేలు కోండ్రు మురళీమోహన్, బేబేనాయన, లోకం నాగమాధవి, పి.అదితి విజయలక్ష్మి గజపతిరాజు, డీసీసీబీ చైర్మన్ నాగార్జున, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో ఇన్‌చార్జి మంత్రి మాట్లాడుతూ జిల్లాలో స్క్రబ్ టైఫస వైరస్ కేసులు లేవని, భయోందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
సమావేశంలో పాల్గొన్న జెడ్పీచైర్మన్, ఎమ్మెల్సీలు
అధికారుల నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు, శాఖ సమన్వయలోపంపై సభలో ప్రస్తావన
అన్నదాత సుఖీభవ పథకం అర్హతల
సవరణకు ప్రతిపాదన
సమస్యలు అవే... సమీక్ష తీరూ అదే..


