విద్యలనగరంతో.. ఘంటసాలకు ఎనలేని బంధం
ఆపాత మధురాలు ఆయన సొంతం
ఘంటసాల సాధన
చేసిన గుమ్చీ
విజయనగరం టౌన్:
సకలకళల సమాహారం విజయనగరం. ఎందరో మహానుభావులు నడయాడిన నేల ఇది. ఇక్కడ పుట్టకపోయినప్పటికీ ఈ గడ్డపై అడుగుపెట్టి, అహోరాత్రులు కష్టపడి ప్రపంచ చరిత్రలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఎందరో మహానుభావుల్లో ఘంటసాల వెంకటేశ్వరరావు ఒకరు. పుట్టింది గుడివాడ సమీపంలోని చౌటుపల్లి గ్రామంలో అయినప్పటికీ తండ్రి సూర్యనారాయణ కోరిక మేరకు ఆంధ్రరాష్ట్రంలో ఏకై క సంగీత కళాశాలగా ఉన్న విజయనగరానికి చేరుకున్నారు. ఆయన వచ్చే సమయానికి వేసవి సెలవుల కారణంతో కళాశాల మూసేసి ఉంది. కళాశాల ప్రిన్సిపాల్ వద్దకు వెళ్లి తన పరిస్థితిని వివరించగా వసతి సమకూర్చారు. ఘంటసాల అక్కడే ఉంటూ రోజుకో ఇంట్లో వారాల భోజనం చేస్తూ ఉండేవారు. 1935 నుంచి 1942 వరకు విజయనగరంలోనే ఉంటూ సంగీత కళాశాల అధ్యాపకుడు పట్రాయుని సీతారామశాస్త్రి వద్ద శిక్షణ పొందారు. ఘంటసాలకు ఆ రోజుల్లో నర్తకి అయిన లక్ష్మీనరసమ్మ (కలవర్ రింగ్) ఘంటసాలను ఆదరించి, అన్నంపెట్టేది. సరస్వతుల వెంకటరావుతో కలిసి గురువు శాస్త్రి శిక్షణలో నాలుగేళ్ల కోర్సును ఘంటసాల రెండేళ్లలో పూర్తిచేశారు. 1922 డిసెంబర్ 4న జన్మించిన చౌటుపల్లిలో జన్మించిన ఘంటసాల 1974 ఫిబ్రవరి 11న 51 ఏళ్ల వయసులో చైన్నెలో మృతిచెందారు. ఆయనకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలున్నారు.
పద్మశ్రీ శివమణికి ఘంటసాల విశిష్ట పురస్కారం
ఘంటసాల 103వ జయంతిని పురస్కరించుకుని ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 4న గురువారం గుమ్చీ వద్దనున్న ఘంటసాల విగ్రహానికి క్షీరాభిషేకం, పుష్పాభిషేకం చేస్తారు. 5వ తేదీ శుక్రవారం సాయంత్రం ఆనందగజపతి ఆడిటోరియంలో ప్రపంచ ప్రసిద్ధ పెర్కషన్ మాస్ట్రో పద్మశ్రీ డాక్టర్ శివమణికి ఘంటసాల విశిష్ట పురస్కారాన్ని అందజేస్తారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆడిటోరియంలో ఘంటసాల సినీ సంగీత స్వరార్చన, నిర్విరామ సంగీత
ఇక్కడి సంగీత కళాశాలలో శిక్షణ
పట్రాయుని సీతారామశాస్త్రి వద్ద
విద్యాబోధన
నేడు ఘంటసాల జయంతి
5న శివమణికి ఘంటసాల పురస్కారం
ఘంటసాల పాటలంటే చెవులుకోసుకునేవారులేరంటే అతిశయోక్తి లేదు. ఘంటసాల చేత తరచూ పాటలు పాడించుకుని ఆస్వాదించే చిత్తూరు నాగయ్య, బీఎన్ రెడ్డిల తమ సినిమా అయిన స్వర్గసీమలో తొలిసారి నేపథ్యగాయకుడిగా అవకాశమిచ్చారు. ఆ పాటకు ఆయనకు రూ.116 పారితోషకం లభించింది. మూగమనసులు, మంచి మనసులు, మహాకవి కాళిదాసు, పుష్పవిలాపం, భగవద్గీత, భక్త తుకారం, గుండమ్మ కథ, కన్యాశుల్కం, డాక్టర్ చక్రవర్తి వంటి చిత్రాలతో పాటు అక్కడ నుంచి వరుస చిత్రాలన్నీ దాదాపుగా ఆయన పాడినవే. ఎటువంటి పాటనైనా ఘంటసాల మాత్రమే పాడగలడు అన్న ఖ్యాతి సంపాదించారు. మనం వింటున్న భగవద్గీత ఆ మహానుభావుడు నోట నుంచి జాలువారినదే. 1970లో ఆయనకు భారతప్రభుత్వం అత్యున్నత పురస్కారం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది.
35 ఏళ్లుగా ఘంటసాల స్మారక కళాపీఠం
ఘంటసాల అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే సంగీతాభిమానులందరూ కలిసి ఘంటసాల కళాపీఠం స్థాపించాం. ఆయన ఎంతో ఇష్టపడి గుమ్చీ దగ్గర సాధన చేసేవారు. ఆయనకు గుర్తుగా అక్కడే విగ్రహాన్ని పెట్టగలిగాం. ప్రతి ఏటా జయంతి, వర్ధంతులతో పాటు ప్రత్యేక పర్వదినాల్లో ఆయన విగ్రహానికి క్షీరాభిషేకాలు నిర్వహిస్తున్నాం. ప్రతినెలా ఘంటసాల స్మారక కళాపీఠం తరఫున ఘంటసాల ఆపాత మధురాల పేరుతో క్రమం తప్పకుండా 35 ఏళ్లుగా సంగీత విభావరి నిర్వహిస్తున్నాం.
– ఎమ్.భీష్మారావు, ఘంటసాల స్మారక
కళాపీఠం వ్యవస్థాపకుడు
విభావరి ఉంటుందని ఘంటసాల స్మారక కళాపీఠం సభ్యులు తెలిపారు.
విద్యలనగరంతో.. ఘంటసాలకు ఎనలేని బంధం
విద్యలనగరంతో.. ఘంటసాలకు ఎనలేని బంధం
విద్యలనగరంతో.. ఘంటసాలకు ఎనలేని బంధం
విద్యలనగరంతో.. ఘంటసాలకు ఎనలేని బంధం


