● పోలీసుల సేవా ‘మార్గం’
విజయనగరం ‘వై’ జంక్షన్ సమీపంలో రోడ్డు అధ్వానంగా మారింది. పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. రోడ్డును బాగుచేయాల్సిన అధికారులు మిన్నకున్నారు. పాలకులు పట్టించుకోలేదు. దీంతో రాకపోకలకు వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. కొన్ని సార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. బుధవారం కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో పోలీసులు స్పందించారు. సీఐలు సూరినాయుడు, లక్ష్మణరావు పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. సేవా దృక్పథంతో దగ్గరుండి గోతులు పూడ్చివేయించి ప్రయాణికుల ప్రశంసలు అందుకున్నారు. దీనికి ఈ చిత్రమే సజీవ సాక్ష్యం. – విజయనగరం క్రైమ్


