● దివ్యాంగుల నిరసన గళం
చంద్రబాబు ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని విస్మరించిందంటూ దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి, ఏపీ పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులు బుధవారం ఆందోళన చేశారు. కళ్లకు నల్లరిబ్బన్‌లు కట్టుకుని విజయనగరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. రీసర్వే, సదరం సర్టిఫికెట్ల పేరుతో దివ్యాంగులకు ప్రభుత్వం కలిగిస్తున్న ఇబ్బందులను ఏకరువుపెట్టారు. చంద్రబాబు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నినదించారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ‘బ్లాక్ డే’గా పరిగణిస్తున్నామని ప్రకటించారు. ఆందోళనలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కానూరు శంకర్రావు, దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.జేసుదాస్‌తో పాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన దివ్యాంగులు పాల్గొన్నారు. – విజయనగరం అర్బన్


