
భయపెడుతున్న విష సర్పాలు
అందుబాటులో ఏఎస్‌వీ వ్యాక్సిన్లు
సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో ఏఎస్‌వీ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించుకోవాలి.
– డాక్టర్ ఎస్.జీవనరాణి,
డీఎంహెచ్‌ఓ
విజయనగరం ఫోర్ట్: పల్లె ప్రజలను విషసర్పాల భయం వెంటాడుతోంది. సాధారణంగా వర్షాకాలంలో పాముల సంచారం అధికం. అదే సమయంలో పొలాల్లో పనులు ఎక్కువగా ఉంటాయి. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనప్పుడు, కూరగాయలు కోసినప్పుడు, పంట పొలాలకు నీరు కట్టే సమయంలోను, పొలం గట్లపై ఏమరపాటుగా వెళ్లిన రైతులు పాముకాటుకు గురవుతున్నారు. ఇటీవల ఇంట్లో నిద్రిస్తున్న వారిని సైతం పాములు విడిచిపెట్టడం లేదు. కొంతమంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడో ఓ చోట పాము కాటు బాధితులు కనిపిస్తూనే ఉన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులకు పాములపై కనీస అవగాహన అవసరమని వైద్యులు అంటున్నారు. కనిపించే పాములన్నీ విషపూరితం కాదు. కట్లపాము, తాచుపాము, రక్తపింజర, నాగుపాము వంటి 15 శాతం పాములతోనే ముప్పు ఉంది. సరైన సమయంలో చికిత్స పొందితే విషసర్పం కరిచినా ప్రాణపాయం నుంచి తప్పించుకోవచ్చు.
రాత్రివేళ పొలాలకు వెళ్లేసమయంలో చెప్పులు వేసుకోవాలి. టార్చిలైట్లతో పాటు శబ్ధం చేసే పరికరాలు వెంట తీసుకుని వెళ్లడం మంచిది. పాముకాటుకు గురైన వారు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. తీవ్ర ఒత్తిడికి గురైతే బీపీ పెరగడంతో పాటు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. పసర వైద్యం, మంత్రాలు అంటూ అలసత్వం వహిస్తే ప్రాణాలకే ప్రమాదం. పాముకాటు వేయగానే పైభాగం గుడ్డతో కట్టాలి. కాటు వేసిన భాగాన్ని కొత్త బ్లేడుతో గాటు వేసి రక్తాన్ని నోటితో లాగేయాలి. నోటి గాయాలు ఉన్న వారు ఇలా చేయకూడదు. ప్రాథమిక వైద్యం అందించిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. కరిచిన పాము ఏదో తెలుసుకుంటే చికిత్స అందించడం సులభం అవుతుంది.
జాగ్రత్తలు
తప్పనిసరి
పాములపై అవగాహన ఉండాలి
పంట పొలాల్లోనే ఎక్కువ..
సాధారణంగా నిర్జీవ ప్రదేశాలను ఎక్కువగా ఇష్టపడే పాములు.. ఆహారం కోసం జనారణ్యంలోకి చొచ్చుకు వస్తున్నాయి. చెత్తా చెదారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, పాడుబడిన భవన శిథిలాలు, పూరి గుడిసెలు, గుబురుగా ఉండే పంట చేలల్లో పాములు ఎక్కువగా నివస్తున్నాయి. ఎలుకలు, కప్పలను ఎక్కువగా ఇష్టపడే పాములు పొలాల్లో సంచరిస్తూ రైతులకు అపాయం తలపెడుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూలై నెలాఖరు నాటికి జిల్లా వ్యాప్తంగా 1222 మంది పాము కాటుకు గురయ్యారు. వీరిలో సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల పరిఽధిలో 921 కేసులు నమోదు కాగా, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 301 కేసులు నమోదయ్యాయి. నలుగురు మృతి చెందారు.
ఏడు నెలల్లో పాముకాటు బాధితులు 1222 మంది
వీరిలో నలుగురి మృతి
వర్షాకాలం కావడంతో పెరిగిన
విషసర్పాల సంచారం
పంట పొలాల్లోనే అత్యధికం
పొలం పనులకు వెళ్లే రైతులు
అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

భయపెడుతున్న విష సర్పాలు

భయపెడుతున్న విష సర్పాలు