
కనకమహాలక్ష్మికి లక్ష పసుపు కొమ్ములతో అర్చన
విజయనగరం టౌన్: పట్టణంలోని సిటీబస్టాండ్ వద్దనున్న కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పంచమిని పురస్కరించుకుని గురువారం లక్ష పసుపు కొమ్ములతో అర్చన జరిపారు. ఆలయ ప్రధాన అర్చకుడు గాయత్రీ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. గాజులతో అమ్మవారిని అలంకరించారు.
నీటి సంరక్షణలో ‘విజయ’పథం
● దేశంలోని అత్యుత్తమ పది జిల్లాల్లో విజయనగరానికి చోటు
విజయనగరం అర్బన్: నీటి సంరక్షణ కట్టడాల నిర్మాణంలో జిల్లాకు ప్రశంసలు దక్కాయి. దేశంలోని అత్యుత్తమ పది జిల్లాల్లో విజయనగరం జిల్లాకు చోటుదక్కింది. నీటి సంరక్షణ కట్టడాల కారణంగా జిల్లాలో భూగర్భ జలమట్టం పెరిగిందంటూ కలెక్టర్ అంబేడ్కర్‌ను సీఎం చంద్రబాబునాయుడు గురువారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో అభినందించారు. నీటి సంరక్షణలో దేశంలోని మొదటి పది జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరు జిల్లాలు ఉండడం ఆనందంగా ఉందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జలమట్టం పెరిగి, జులై నాటికి 4.15 మీటర్లకు చేరిందని తెలిపారు. కార్యక్రమంలో జేసీ ఎస్.సేతు మాధవన్, ఇతర అధికారులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
జేసీకి అభినందనలు
విజయనగరం అర్బన్: విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఏడాది పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న ఎస్.సేతుమాధవన్‌ను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురువారం అభినందించారు. కలెక్టర్ చాంబర్‌లో కలెక్టర్ కేక్ కట్‌చేసి జేసీకి అభినందనలు తెలిపారు. దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు తాడ్డి గోవింద, తదితరులు పాల్గొన్నారు.
సెంచూరియన్ చాన్స్‌లర్‌కు అవార్డు
నెల్లిమర్ల రూరల్: మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వవిద్యాలయం చాన్స్‌లర్ ప్రొఫెసర్ జీఎస్‌ఎన్ రాజు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ ఫర్ బెస్ట్ ఇంజినీరింగ్ ఎడ్యుకేటర్ అవార్డును అందుకున్నారు. మదనపల్లి ఇనిస్టిట్యూట్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఐఎస్‌టీఈ అధ్యక్షుడు డాక్టర్ దేశాయ్, అనంతపురం జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ సుదర్శన్ చేతుల మీదుగా అవార్డు, ప్రసంసా పత్రాన్ని తీసుకున్నారు.

కనకమహాలక్ష్మికి లక్ష పసుపు కొమ్ములతో అర్చన

కనకమహాలక్ష్మికి లక్ష పసుపు కొమ్ములతో అర్చన