
నేడే మువ్వన్నెల పండగ
విజయనగరం అర్బన్: స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విజయనగరం పొలీస్ బ్యారెక్స్‌లో శుక్రవారం నిర్వహిస్తామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే జాతీయజెండా వందన కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొంటారన్నారు. వివిధ శాఖల పురోగతిని సూచించేలా శకటాల ప్రదర్శన, చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేస్తామని తెలిపారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ అంబేద్కర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. స్వాతంత్య్రదినోత్సవ ఏర్పాట్లను జేసీ సేతుమాధవన్ పరిశీలించారు. జెండా పండగలో భాగంగా రైల్వేస్టేషన్, కలెక్టరేట్, నగరంలోని పలు కూడళ్లను విద్యుత్ దీపాలతో అలంకరించారు.

నేడే మువ్వన్నెల పండగ

నేడే మువ్వన్నెల పండగ