గురువుపై దిద్దుబాటు బరువు | - | Sakshi
Sakshi News home page

గురువుపై దిద్దుబాటు బరువు

Aug 15 2025 6:30 AM | Updated on Aug 15 2025 7:22 AM

ఏకోపాధ్యాయ పాఠశాలలో అమలు సాథ్యం కాదు

ప్రాథమిక విద్య పరీక్ష విధానంలో నూతనంగా అమలు చేస్తున్న సెల్ఫ్‌ అసెస్మెంట్‌ బుక్‌ సిస్టం ఏకోపాధ్యాయ పాఠశాలలో సాధ్యం కాదు. ఐదు తరగతుల ఒక్కో విద్యార్ధికి ఒక్కో సబ్జెక్టు పుస్తకాన్ని నిర్వహించడం వల్ల పాఠ్యాంశాల బోధనలో నాణ్యత లోపిస్తుంది. విద్యార్థి అభ్యసన సామర్థ్యం ఆధారంగా ఆ స్కూల్‌ టీచర్‌ చేతనే ప్రశ్నపత్రాన్ని రూపొందించే విధానం ఇందులో తీసుకురావాలి. అదే విధంగా ప్రశ్నపత్రాలలో సరళమైన భాష వాడాలి.

– జేఏవీఆర్‌కే ఈశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్‌

తలకుమించిన భారం

ప్రాథమిక స్థాయిలో ఈ విధానం సరికాదు. పుస్తకాలపై పరీక్ష జవాబు పత్రం రాయించి వాటిని జాగ్రత్త పరచడం ఉపాధ్యాయులకు తలకు మించిన భారం. పాఠాలు చెప్పడానికే సమయం సరిపోదు. అసెస్మెంట్‌ పేరుతో అమలు చేస్తున్న ఈ విధానం ద్వారా ఫలితాలు ఎలా వస్తాయో తెలియదు. కానీ ఈ విధానాన్ని నిర్వహించడానికి ఇవి పాఠశాలలో లేదంటే ప్రయోగశాలలో అర్థం కావడం లేదు.

– చిప్పాడ సూరిబాబు,

జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్‌టీయూ

సమయం పెంచాలి

అసెస్మెంట్‌ విధానంలో పరీక్షలు నిర్వహించడానికి ప్రస్తుతం నిర్దేశించిన సమయం సరిపోదు. ఒక్కో విద్యార్థితో పుస్తక రూపంలో జవాబు పత్రాలను రాయించడం కష్టతరమైన పని. అసెస్మెంట్‌ పుస్తకాన్ని విద్యార్థి భద్రంగా ఉంచకపోతే ఉపాధ్యాయులకు రిమార్క్‌. విద్యార్ధులందరినీ సబ్జెక్టు వారీగా ఆ పుస్తకాలను ఏడాది పాటు భద్రంగా ఉంచడం ఉపాధ్యాయులకు భారంగా మారుతుంది.

– డి.శ్రీనివాస్‌, జిల్లా ప్రధానకార్యదర్శి,

పీఆర్‌టీయూ

విజయనగరం అర్బన్‌/రాజాం:

కూటమి ప్రభుత్వ విద్యావిధానాలు విద్యార్థులతో పాటు గురువులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. సెల్ఫ్‌ అసెస్మెంట్‌ విధానం ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారింది. పరీక్ష పత్రాల మూల్యాంకనం, మార్కుల నమోదు, రికార్డుల అప్‌లోడ్‌ తదితర పనులతో బోధనకు సమయం ఉండదని, విద్యాప్రమాణాలు కుంటుపడతాయ న్నది ఉపాధ్యాయులవాదన. కొత్త విధానంలో ప్రతి విద్యార్థికి సబ్జెక్టుకు ఒకటి చొప్పున అసెస్మెంట్‌ పుస్తకాన్ని నిర్దేశించారు. అందులోనే ఏడాది పాటు నిర్వహించే పరీక్షల జవాబు పత్రాలు, ఓఎంఆర్‌ షీట్లు, ప్రాజెక్టు వర్క్‌ మార్కుల పట్టికల పేజీలను జతజేశారు. ఏడాదికి నాలుగుసార్లు జరిగే ఫార్మేటివ్‌ పరీక్షలకు 35 మార్కులతో పాటు స్టూడెంట్‌ హ్యాండ్‌ రైటింగ్‌, రెస్పాన్స్‌, ప్రాజెక్టు వర్క్‌ల పేరుతో 5 మార్కుల వంతున మరో 15 మార్కులు నమోదుచేయాలి. ఏడాదికి రెండుసార్లు జరిగే సమ్మేటివ్‌ పరీక్షలను 80 మార్కులు వంతున నిర్వహిస్తారు.

ఉమ్మడి విజయనగరం జిల్లాకు

9.06 లక్షల పుస్తకాలు

ప్రాథమిక పాఠశాలల్లో 1, 2 తరగతులకు మూడు సబ్జెక్టులుంటాయి. అదే విధంగా 3, 4, 5 వ తరగతులకు నాలుగు, 6, 7 తరగతులకు 6 సబ్జెక్టులు, 8 నుంచి 10వ తరగతి వరకు ఏడు సబ్జెక్టుల పుస్తకాలు ప్రతి విద్యార్ధికీ ఉంటాయి. వీటిని విద్యాసంవత్సర ఏడాది పాటు మాత్రమే కాకుండా ఆ విద్యార్ధి స్కూల్‌ నుంచి బయటకు వెళ్లిన తరువాత కూడా భద్రపరచాల్సి ఉంటుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో దాదాపు 1.51 లక్షల మంది విద్యార్ధులు 1 నుంచి 10 తరగతి వరకు చదువుతున్నారు. వీరికి అన్ని సబ్జెక్టులకు 9 లక్షల 6 వేల 679 అసెస్మెంట్‌ పుస్తకాలు వచ్చాయి. వాటితో ఈ నెల 11 నుంచి ఈ పరీక్షల కొత్త విధానాన్ని నిర్వహిస్తున్నారు. అసెస్మెంట్‌ పుస్తకంలో విద్యార్థులు తమ అపార్‌ నంబర్‌, పరీక్ష కోడ్‌ రాసి బబ్లింగ్‌ చేయాలి. పుస్తకంలో జవాబులు రాయడంతో పాటు అందులో పొందుపరిచిన ఓఎంఆర్‌ షీట్‌లో సరైన సమాధానాలకు బబ్లింగ్‌ చేయాలి. వీటిని సరిగ్గా ఉండేలా ఉపాధ్యాయుడు చూడాలి. వెంటవెంటనే మూల్యాంకనం చేయాలి.

ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తున్న అంశాలు..

పరీక్షల అనంతరం ఆదే రోజు లేదా తక్షణం మూల్యాంకనం చేసి రిపోర్డులు పంపాల్సి రావడం

ఆన్‌లైన్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా మార్కుల అప్‌లోడ్‌లో సాంకేతిక సమస్యలు

చిన్న పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు అన్ని బాధ్యతలు చేపట్టడం వల్ల పాఠ్యాంశాల బోధనకు సమయం ఉండదు.

ప్రతి విద్యార్థికి సబ్జెక్టుకు ఒక పుస్తకం ఉండడం వల్ల వాటిని ఏడాది పాటు స్కూల్‌లో సంరక్షణ క్లిష్టతరం.

అసెస్మెంట్‌ విధానంలో పుస్తక

మూల్యాంకనం

ఒక్కో సబ్జెక్ట్‌కు ప్రత్యేకంగా పుస్తకాలు

ఉపాధ్యాయులదే మూల్యాంకన బాధ్యత

తలలు పట్టుకుంటున్న గురువులు

బోధనకు సమయం ఉండడంలేదంటూ ఆందోళన

చెప్పలేని కష్టాలు

పుస్తకాలకు మూల్యాంకనం నిర్వహించడం ఉపాధ్యాయులపై పెనుభారం. సింగిల్‌ ఉపాధ్యాయుడు ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇబ్బందులు తప్పవు. ఉన్నత పాఠశాలల్లో వందలాదిమంది విద్యార్థులు ఉంటే రోజుల తరబడి మూల్యాంకన చేయాల్సి ఉంటుంది. మరోవైపు హోలిస్టిక్‌ కార్డులను కూడా పూరించాలి. ఇదంతా కష్టతరం.

– అదపాక దామోదరరావు, ప్రభుత్వ ఆంగ్ల ఉపాధ్యాయుడు, రాజాం

స్కూల్‌ ఎడ్యుకేషన్‌ విధానానికి తగ్గట్టుగా ...

అసెస్మెంట్‌ పుస్తకాల విధానం గందరగోళంగా ఉందనే విష యం మా దృష్టికి వచ్చింది. మూల్యాంకనంలో ఉపాధ్యా యులు తీవ్ర ఒత్తిడికి గురౌతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడాం. ఎస్‌ఎస్‌ఏ ఆదేశాలతో ఈ విధానం వచ్చింది. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఈ విధానాన్ని అమలుచేస్తోంది. – యాగాటి దుర్గారావు, ఎంఈఓ, రాజాం

గురువుపై దిద్దుబాటు బరువు 1
1/9

గురువుపై దిద్దుబాటు బరువు

గురువుపై దిద్దుబాటు బరువు 2
2/9

గురువుపై దిద్దుబాటు బరువు

గురువుపై దిద్దుబాటు బరువు 3
3/9

గురువుపై దిద్దుబాటు బరువు

గురువుపై దిద్దుబాటు బరువు 4
4/9

గురువుపై దిద్దుబాటు బరువు

గురువుపై దిద్దుబాటు బరువు 5
5/9

గురువుపై దిద్దుబాటు బరువు

గురువుపై దిద్దుబాటు బరువు 6
6/9

గురువుపై దిద్దుబాటు బరువు

గురువుపై దిద్దుబాటు బరువు 7
7/9

గురువుపై దిద్దుబాటు బరువు

గురువుపై దిద్దుబాటు బరువు 8
8/9

గురువుపై దిద్దుబాటు బరువు

గురువుపై దిద్దుబాటు బరువు 9
9/9

గురువుపై దిద్దుబాటు బరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement