
విజయనగరం
న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025
విజయనగరం మండలం దుప్పాడ గ్రామానికి చెందిన కె.సత్యవతికి పొలంలో పాము కాటు వేయడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.
గరివిడి బిసీ కాలనీకి చెందిన వరదా సత్యవతికి ఇంట్లోనే పాము వేయడంతో కుటుంబ సభ్యులు చీపురపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.
‘ బొండపల్లి మండలం గొట్లాం గ్రామానికి చెందిన తులసీరావు అనే వ్యక్తికి తన ఇంటి వద్ద పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.’