● రోడ్డున పడిన ఆటోడ్రైవర్లు
● ఆందోళనలో సుమారు 28వేల కుటుంబాలు
● తమ పరిస్థితి ఏమిటని ఆవేదన
● వాహనమిత్ర అమలు చేయాలని భారీ ర్యాలీ
● కలెక్టరేట్ వద్ద ఆందోళన
మా గోడు వినండి ..
ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేయడానికి నిర్ణయించిన మహిళలకు ఫ్రీ బస్సు పథకం వల్ల స్వయం ఉపాధి రంగంగా జీవనం సాగిస్తున్న ఆటో, క్యాబ్ డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతారు. కరోనా అనంతరం ఆర్థికంగా దెబ్బతిన్న ఆటో, క్యాబ్ డ్రైవర్ల కుటుంబాలు నేటికీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఉపాధి అవకాశాలు లేక స్వయం ఉపాధిగా సొంత పెట్టుబడితో ఒక పక్క ఫైనాన్స్ చెల్లించుకుంటూ మరోవైపు ప్రభుత్వనికి చెల్లించాల్సిన రోడ్, గ్రీన్ టాక్స్, రెన్యువల్, పొల్యూషన్ వంటి పన్నులు చెల్లిస్తూ జీవనం సాగిస్తున్నారు. పట్టణంలో కార్పొరేట్ సంస్థలైన రాపిడో, ఉబర్, ఓలా వంటి కంపెనీలకు అనుమతులు ఇవ్వడం వల్ల ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఉపాధి దెబ్బతింది. వ్యక్తిగత వాహనాలపై పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ నిర్వహించకూడదని కర్ణాటక హైకోర్టు తీర్పు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బహుళ జాతి సంస్థలకు అనుమతులను ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆటో, క్యాబ్ డ్రైవర్లను ఆదుకుంటామని చెప్పి హామీ గాలికొదిలేసింది.
– కె.సురేష్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
వాహనమిత్ర అమలు చేయాలి..
కూటమి ప్రభుత్వం వాహనమిత్ర కింద ఏడాదికి రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. జీవో నం 21 రద్దు చేసి అపరాధ రుసుం భారం తగ్గిస్తామని చెప్పింది. వాహనాలపై పెంచిన గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామని, వాహన కొనుగోలుకు సంబంధించి వడ్డీపై సబ్సిడీ అందిస్తామని నేతలు హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి ఏడాదైనా నేటీకీ అవేమీ అమలు కావడం లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమంటూ చెబుతున్నారు. ఈ క్రమంలో అంత కంటే ముందు వాహనమిత్ర అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు చేసే వరకు పోరాడతాం.
– ఆటో కార్మికుడు, జి.కూర్మారావు, విజయనగరం
విజయనగరం గంటస్తంభం: ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ హామీ కాకరేపుతోంది. ఆ హామీ అమలు చేసి తమ పొట్ట కొట్టొదంటూ ఆటోడ్రైవర్లు ర్యాలీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించొద్దంటూ విజయనగరంలో ఆటోడ్రైవర్లు రోడ్డెక్కారు. చలో కలెక్టరేట్ నినాదంతో ర్యాలీ చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలతో తమకు ఉపాధి తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రీ బస్సు నడిపే ముందు తమ వ్యవహారం చూడాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు. ఎక్కడికక్కడ మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తే తమకు ఉపాధి అవకాశాలు దెబ్బ తింటాయని విజయనగరం ఆటో కార్మిక సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆటో చక్రం కదిలితేనే బతుకు బండి సాగేది
దశాబ్దాలుగా వారి జీవనాధారం ఆటోలే. ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు 28వేల మంది ఆటో, క్యాబ్ కార్మికులు ఉన్నారు. వైఎస్సార్‌సీపీ ప్ర భుత్వం హయాంలో వారికి వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఏటా అమలయ్యేది. ప్రతి ఒక్కరికీ ఈ పథ కం వర్తింపజేయడం ద్వారా లబ్ధి చేకూరేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాహన మిత్ర కింద రూ.15వేలు ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచి విస్తృత ప్రచారం కల్పించారు. దాన్ని నమ్మి వారంతా కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. ఇప్పుడు మోసపోయామని గుర్తించి ఆందోళన చెందుతున్నారు. జగనన్న ప్రభుత్వంలో ఏటా వాహనమిత్ర పథకం తమకు అందేదని ఇప్పుడు దాన్ని కూటమి పాలకులు పక్కన పెట్టారని వాపోతున్నారు.
ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఆందోళన..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాహన మిత్ర పథకం కింద ఇస్తామన్న రూ. 15వేలు నేటికీ ఇవ్వలేదు. ఆ ఊసే ఎత్తడం లేదు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజుల్లోనే ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ,క్యాబ్ డ్రైవర్లు సంక్షేమం కోసం రూ. 400 కో ట్లు బడ్జెట్ కేటాయించి నాడు అర్హులందరికీ రూ. 10వేలు చొప్పున అందించారు. కూటమి ప్రభుత్వం ఆ మాదిరిగానే ఇస్తుందని ఆశించిన డ్రైవర్లకు నిరాశే మిగిలింది. ఇదే సమయంలో సీ్త్రశక్తి కింద మహిళలకు ఉచిత బస్సు పథకం తీసుకువస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు ప్రకటించిన క్రమంలో తమ బతుకు బండి సంగతేంటని వారంతా ఆందోళన చెందుతున్నారు.
హమీల అమలుకు ర్యాలీ..
కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాహనమిత్ర హామీతో పాటు మోటారు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డ్రైవర్లు, మోటారు కార్మికులు డిమాండ్ చేశారు. సీ్త్రశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు అమలు చేసేలోపు వాహనమిత్ర అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో సోమవారం డ్రైవర్లు, కార్మికులు విజయనగరంలో ర్యాలీ నిర్వహించారు.
ఫ్రీ బస్సు మీద కస్సుబుస్సు
ఫ్రీ బస్సు మీద కస్సుబుస్సు
ఫ్రీ బస్సు మీద కస్సుబుస్సు
ఫ్రీ బస్సు మీద కస్సుబుస్సు