
రాష్ట్ర పోటీలకు గుణుపూరుపేట విద్యార్థినులు
డెంకాడ: రాష్ట్ర సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు గుణుపూరుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకూ ప్రకాశం జిల్లాలోని చెవ్వూరులో జరగనున్న పోటీలకు గుణుపూరుపేట ఉన్నత పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థినులు ఆబోతుల తేజస్విని, గేదెల మానస ఎంపికయ్యారు. అలాగే వచ్చే నెల అనంతపురంలో జరగబోయే జూనియర్ బాల్ బాడ్మింటన్ రాష్ట్రస్థాయి పోటీలకు పదవ తరగతి విద్యార్థినులు సీహెచ్ రోహిణి, కెల్ల నవ్య, కెల్ల రేష్మ ఎంపికయ్యారు. వారిని పాఠశాల హెచ్‌ఎం సీహెచ్ అరుణ, వ్యాయామ ఉపాధ్యాయుడు సారిపల్లి గౌరీశంకర్ తదితరులు అభినందించారు.