
గాయత్రీమాతకు పసుపు కొమ్ములతో అలంకరణ
రాజాం సిటీ: రాజాం గాయత్రికాలనీలో వెలసి న గాయత్రిమాతను పసుపు కొమ్ములతో ఆల య ధర్మకర్త కొండవేటి వివేకానంద, ఆలయ అర్చకులు వాస జగదీశ్వరరావు గురువారం అలంకరించారు. శ్రావణ మాసంలో వచ్చే మూడో శుక్రవారాన్ని పురస్కరించుని అమ్మవారిని అలంకరించినట్టు అర్చకులు తెలిపారు.
వైవాహిక బంధంపై
అవగాహన కల్పించాలి
విజయనగరం ఫోర్ట్: అమ్మాయి, అబ్బాయిలకు వైవాహిక బంధంపై అవగాహన కల్పించిన తర్వాతే పెళ్లిజరిపించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలోని వన్‌స్టాప్ సెంటర్‌లో గురువారం కొత్తగా ప్రీ మేరిటల్ కౌన్సెలింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. దీనిపై రుపొందించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. పెళ్లి చేసుకోబోయే అమ్మా యి, అబ్బాయి ఈ కేంద్రాన్ని సంప్రదిస్తే పెళ్లి గురించి, ఆ తర్వాత కలిగే లాభనష్టాలపై అవగాహన కల్పిస్తారన్నారు. దీనివల్ల వివాహ జీవి తం ఆనందంగా సాగించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ విమలారాణి, డీఎల్‌ఓ డాక్టర్ రాణి, సెంటర్ ఆడ్మినిస్ట్రేటర్ సాయి విజయలక్ష్మి పాల్గొన్నారు.
సీసీ కెమెరాలతో నిఘా
విజయనగరం క్రైమ్: విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం కొత్తగా 16 సీసీ కెమెరాలను అమర్చారు. నేర నియంత్రణలో భాగంగా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు వైఎస్సార్ నగర్, మెడికల్ కాలేజ్, కాటవీధి, డబుల్ కాలనీ తదితర చోట్ల సీసీ కెమెరాలు పెట్టామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. వీటి సాయంతో నేర ప్రవృత్తికలిగిన వ్యక్తుల కదలికలపై నిఘావేస్తామన్నారు.
పంచాయతీలకు నిధులు రాక ఇబ్బందులు
● జెడ్పీ సీఈఓ సత్యనారాయణ
రామభద్రపురం: పంచాయతీలు, మండల పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధులు సకాలంలో రాకపోవడంతో గ్రీన్ అంబాసిడర్లకు వేతనా లు ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నది వాస్తవమేనని జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ అన్నారు. రామభద్రపురం మండలంలోని బూసాయవలస, ముచ్చర్లవలస గ్రామాలను ఆయన గురువారం సందర్శించారు. పారిశు ద్ధ్య పనులు, తాగునీటి పథక పనులను పరిశీ లించారు. ఇంటింటి చెత్త సేకరణ తీరును ఆయా గ్రామాల మహిళలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి పథకాల శుభ్రత తేదీలు తెలిపేలా బోర్డులు ఏర్పాటుచేయాలని సిబ్బందిని ఆదేశించారు. క్లాప్ మిత్రలకు వేతన బకాయి లు లేకుండా చూడాలన్నారు. అనంతరం స్థాని క విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల్లో సుస్థ ర అభివృద్ధే లక్ష్యంగా 30 నుంచి 40 మంది మహిళలతో క్లస్టర్ ఏర్పాటు చేసి వారిలో ఒకరి ని క్లస్టర్ కోఆర్డినేటర్ నియమిస్తూ పరిశుభ్రత పై అవగాహన కల్పించేలా శిక్షణ ఇస్తామన్నా రు. ఈ నెలలో 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీఓ సీహెచ్ సన్యాసిరా వు, వెంకటరమణ, పాల్గొన్నారు.

గాయత్రీమాతకు పసుపు కొమ్ములతో అలంకరణ

గాయత్రీమాతకు పసుపు కొమ్ములతో అలంకరణ

గాయత్రీమాతకు పసుపు కొమ్ములతో అలంకరణ