
ఉచిత బియ్యానికి రూ.200 ఖర్చు
జీపుదిగి రేషన్ సరుకుల కోసం నేరళ్లవలస డిపోకు వస్తున్న గిరిజనులు
చిత్రంలో జీపు దిగి వస్తున్నవారంతా ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా గ్రూపు గ్రామాల గిరిజనులు. రేషన్ తీసుకోవాలంటే కొండలపై నుంచి దిగి దండిగాం, నేరళ్లవలస, కురుకూటి డిపోలకు రావాల్సిందే. దీనికోసం ప్రయాణ ఖర్చుల కింద రూ.100, బియ్యం మూటకు రూ.100 చెల్లిస్తున్నట్టు లబ్ధిదారులు వాపోయారు. ఎండీయూ వాహనాలతో సరుకుల పంపిణీని కూటమి ప్రభుత్వం రద్దుచేయడంతో డిపోల్లో ఇచ్చే ఉచిత బియ్యం తీసుకెళ్లేందుకు ప్రతినెలా రూ.200 ఖర్చు అవుతోందని, ఒక రోజంతా పనిపోతోందని వాపోయారు.
– సాలూరు రూరల్

ఉచిత బియ్యానికి రూ.200 ఖర్చు