
అమ్మ పాత్ర..
వ్యక్తిత్వ నిర్మాణంలో అమ్మపాత్ర కీలకం.ఉదయమే నిద్రలేపడం,పిల్లలకు ఇస్టమైన మెనూ సిద్ధం చేయడం,పుస్తకాలు సర్ధి పాఠశాలకు పంపడం వరకు క్షణం తీరికలేనిది.ఇది రొటీన్‌గా మారకుండా చిన్నారుల్ని చదువులో మమేకం చేసేందుకు వీలున్న అంశాలపై తల్లులు అవగాహన పెంచుకోవాలి.పాఠశాల నిబంధనలు మేరకు పెన్సిళ్లు,పెన్నులు,స్కేళ్లు రబ్బర్లు చూడడానికి ఇవి చిన్నవే అన్నట్లు కనిపిస్తాయి.ఇందులో ఏ ఒక్కటి లేకున్నా తరగతి గదిలో పిల్లలు ఇబ్బంది పడక తప్పదు. వాటిని తప్పకుండా బ్యాగులో ఉంచాలి.ఉన్నత తరగతికి వెళ్తున్నారు కదా అని సరిపెట్టుకోకుండా పాత పుస్తకాల్లోని అంశాలను పిల్లల చేత ఒకసారి పునశ్చరణ చేయించాలి.
– ఎం.దీప, కేజీబీవీ ప్రిన్సిపాల్, బూసాయవలస
●