
యూరియా ఏది బాబూ..!
సంతకవిటి: మండలంలోని తాలాడ గ్రామ రైతులు యూరియా కోసం స్థానిక సచివాలయం వద్ద శుక్రవారం ఆందోళనకు దిగారు. వీఏఏను చుట్టుముట్టి ఎరువుకోసం నిలదీశారు. తమ గ్రామంలో దాదాపు 875 ఎకరాల్లో వరి ఉభాలు వేస్తే కేవలం 260 బస్తాల యూరియా సరఫరాకు సన్నద్ధం కావడంపై నిలదీశారు. అరకొర ఎరువు మాకొద్దంటూ యూరియా తీసుకునేందుకు నిరాకరించారు. మిగిలిన రైతులకు సోమవారం తెచ్చి ఇస్తామని ఇన్‌చార్జి వీఏఏ వి.శివశంకర్ చెప్పడంతో ఆందోళన విరమించారు. మండల రైతులు ఎరువుకోసం నానా తిప్పలు పడుతున్నా వ్యవసాయాధికారి యశ్వంత్‌రావు, స్థానిక ఎమ్మెల్యే కనీసం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓట్లు అవసరమైనప్పుడే రైతు గుర్తుకు వస్తారని, తర్వాత రైతు కష్టాలను పట్టించుకునేవారే కరువయ్యారంటూ వాపోయారు.
తాలాడలో రైతుల ఆందోళన