తెలుగు తమ్ముళ్ల
ఇసుక దోపిడీ!
బొబ్బిలి:
రూపాయి ఖర్చు లేకుండా ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. పట్టణంలోని గ్రోత్ సెంటర్‌లో ఉన్న ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఉన్న ఇసుకను తరలించకుండా నదుల్లోని ఇసుకను అక్రమంగా తరలించుకుపోయేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. తద్వారా కాసు లు వెనకేసుకుంటున్నారు. గ్రోత్ సెంటర్‌లోని కంపెనీలకు ఇతర ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు తరలించేందుకు ఇసుకాసురులు అక్రమ మార్గాలే తప్ప సక్రమంగా ఇసుక తరలిద్దామన్న ఊసే లేదు. జిల్లాలోని ఇసుక రేవుల్లో ఇసుక నిల్వలు లేవని, నదుల్లో ఇసుకను ఇష్టానుసారం తవ్వేస్తే సాగు, తాగునీటి వనరులకు ఇబ్బందులు వస్తాయని నియంత్రణ చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం ఇక్కడ ఇసుకను తవ్వనీయకుండా ఇతర జిల్లాల నుంచి తీసుకువచ్చి జిల్లాలోని నాలుగు పాయింట్లు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆయా పాయింట్లకు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇసుకను తరలించి నిల్వ చేసి అవసరాన్ని మేరకు నామమాత్రపు ధరతో అందజేసేవారు. కాంట్రాక్టర్లు, వినియోగదారులు తమకు వచ్చిన నామమాత్రపు ధరలో ఇసుకను ట్రాక్టర్లు, లారీలతో తర లించేవారు. ఇందుకోసం మైనింగ్ డిపార్ట్‌మెంట్, రెవెన్యూ శాఖలు పర్యవేక్షించేందుకు తమ సిబ్బందిని సైతం నియమించారు. ఇసుకను అక్రమంగా రవాణా చేసే వీలు లేకుండా జిల్లాలోని అన్ని రీచ్‌ల వద్ద తనిఖీలు ముమ్మరం చేసి నియంత్రించారు. బొబ్బిలి గ్రోత్ సెంటర్, కొత్తవలస, డెంకాడ తదితర ప్రాంతాల్లో స్టాక్ పాయింట్‌లను ఏర్పాటు చేశారు.
ఇసుక తోడేస్తున్నారు..
పట్టణంలోని గ్రోత్ సెంటర్ ఇసుక పాయింట్‌లో సుమారు 10వేల టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వల నుంచి ఇసుకను తీసుకునేందుకు ఎవ రూ ముందుకు రావడం లేదు. పక్కనే ఉన్న వేగావతి,సువర్ణముఖి నదుల నుంచి ఇసుకను అక్రమంగా పొక్లెయిన్లు, ట్రాక్టర్లు, లారీలతో తరలించుకుపోతు న్నారు. కనీస రుసుము కూడా చెల్లించనక్కర లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. పొక్లెయినర్లు, ట్రాక్టర్లను సీజ్ చేస్తున్నా అక్రమార్కులు ఆగడం లేదు.
ర్యాంపులు లేకపోయినా
వేగావతి నదీ పరీవాహక ప్రాంతాలైన పారాది, భోజరాజపురం, కారాడ, అలజంగి ప్రాంతాల్లో ఎక్కడా ఇసుక ర్యాంపులు లేవు. ఈ ప్రాంతాల్లో ఇసుక తరలింపునకు అనుమతులు లేకపోయినా కూటమి ప్రభుత్వంలోని వేగావతి తీరం పరిసర గ్రా మాల టీడీపీ నాయకులు ఇసుకను తరలిస్తున్నారు.
లోపభూయిష్టం
బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో ఉన్న కంపెనీల్లో ఇసుక అవసరం. ఈ ఇసుకను యాజమాన్యాలు సమీకరించుకోలేక కాంట్రాక్టుకు ఇస్తుంటాయి. ఆయా కంపె నీలకు ఇసుకను తరలించేందుకు పలువురు టీడీపీ నాయకులు కాంట్రాక్టును తీసుకున్నారు. కంపెనీల కు కావాల్సినంత ఇసుకను తరలించేందుకు ట్రాన్స్‌పోర్టు, ఇసుక ధర, లేబర్ చార్జీలను కలుపుకుని కాంట్రాక్టుకు పాడుకున్న కాంట్రాక్టర్లు వేగావతి నదిలో ని ఇసుకను నాటుబళ్లతో తరలిస్తున్నారు. నాటు బండికై తే రూ.500 నుంచి 800ల లోపున చెల్లించి ఒకే చోట డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి లారీలు, ట్రాక్టర్లతో ఇసుకను ఆయా కంపెనీలకు తరలిస్తున్నారు.
బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో ఉన్న ఇసుక డంపింగ్ యార్డులో 10,000 టన్నుల ఇసుక నిల్వలున్నాయి. కానీ ఇక్కడ ఎవరూ కొనుగోలు చేయడం లేదు. ఇక్కడ నిర్ణీత ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తుందని, సదరు కాంట్రాక్టుదారులు ఇన్‌ఫిల్టరేషన్ బావులు, వంతెనల వద్ద ఉన్న ఇసుకను తవ్వుకుపోతున్నారు. ఆర్డీఓ రామమోహనరావు, తహసీల్దార్ ఎం.శ్రీను సైతం ఇసుక అక్రమ తరలింపును అడ్డు కుని జరిమానాలు విధిస్తున్న సందర్భాలున్నాయి. గృహ నిర్మాణానికి అని చెప్పి బొబ్బిలి పట్టణానికి తాగునీరందించే ప్రధాన నీటివనరు కేంద్రానికి చెందిన ఇన్‌ఫిల్టరేషన్ బావుల చుట్టూ ఇసుకను తవ్వుతున్నారు. అక్కడి నుంచి సమీప గ్రామాలకు నాటుబళ్లతో తరలిస్తున్నారు. డంపింగ్ చేసిన చోటు నుంచి కాంట్రాక్టు కుదుర్చుకున్న కంపెనీలకు తరలిస్తున్నారు.
మూతపడుతున్న ఇన్‌ఫిల్టరేషన్ బావులు
పట్టణానికి తాగునీరందించే ఇన్‌ఫిల్టరేషన్ బావులు ఇసుక తవ్వకాల వలనే మూతపడుతున్నాయి. ఇటీవలే ఒక ఇన్‌ఫిల్టరేషన్ బావి మూతపడింది. ఇసుక కోసం బావుల చుట్టూ పూర్తిగా తవ్వేయడంతో నీరు ఊరక బావులు మూతపడుతున్నాయని అధికారు లు గుర్తించారు. దీని వలన పట్టణానికి రోజు విడిచి రోజు తాగునీరు అందించే పరిస్థితి ఏర్పడింది.
పాయింట్‌లోని ఇసుక వద్దు
అక్రమ రవాణ ముద్దు
వృథాగా 10వేల టన్నుల ఇసుక
రూ.10వేల జరిమానా విధిస్తాం..
ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపు నా దృష్టికి వచ్చింది. ఆయా వాహనా లు నాకు ఎదురయ్యాయి. వాటిని విడిచిపెట్టకుండా సీజ్ చేయించాను. ఇక ముందు ఇసుకను ఎవ రు అక్రమంగా తరలించినా కఠిన చర్యలు తీసుకుంటాం. రూ.10వేల జరిమానా విధిస్తాం. గ్రోత్ సెంటర్ స్టాక్ పాయింట్‌లో ఇసుకను ఎవ రూ కొనుగోలు చేయడం లేదు. ఇసుకంతా వృథా అవుతున్నా నదిలోనే అక్రమంగా తవ్వేస్తున్నారు. ఇక ముందు వారి ఆటలు సాగనివ్వం.
– జేవీఎస్‌ఎస్ రామమోహనరావు,
ఆర్డీఓ, బొబ్బిలి
తెలుగు తమ్ముళ్ల
తెలుగు తమ్ముళ్ల


