● సీహెచ్‌ఓల ధర్నా
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్‌ఓ) సర్వీసును క్రమబద్ధీకరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా చేశారు. తమ సమస్యలపై గళమెత్తారు. జీఓ 64 ప్రకారం ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం జీతాన్ని పెంచాలని, ఎన్‌హెచ్‌ఎం హెచ్‌ఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా లాయల్టీ బోనస్ చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులను క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. నెలవారీ ప్రాతిపదికన జీతం, ప్రోత్సాహకం అందించాలని కోరారు. హెడ్ క్వార్టర్‌లో నివహించేందుకు వీలుగా హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలన్నారు. ఆందోళనలో సీహెచ్‌ఓలు ఎం.ప్రసన్నకుమార్, మౌనిక, కరుణ్‌కుమార్, తేజశ్వని, శ్వేత తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం ఫోర్ట్


