
● అంగన్‌వాడీ కేంద్రాలకు కుళ్లిన గుడ్లు
చిత్రాల్లో కనిపించిన కుళ్లిన కోడిగుడ్లు గజపతినగరం మండలంలోని సీతారామపురం, కొణిశ అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసినవి. కుళ్లిన గుడ్లు సరఫరా చేయడంతో అంగన్‌వాడీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. పిల్లలు, గర్భిణులకు కుళ్లిన గుడ్లను ఎలా వండిపెట్టేదని ప్రశ్నిస్తున్నారు. నెలలో నాలుగుసార్లు అంగన్ కేంద్రాలకు గుడ్లను సరఫరా చేయాల్సి ఉండగా, మూడుసార్లు మాత్రమే పంపిణీ చేస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయాన్ని సంబంధిత సీడీపీఓ నాగమణి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా కోడిగుడ్లు కుళ్లిపోతే లబ్ధిదారులకు ఇవ్వవద్దని కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. కుళ్లిన గుడ్ల ఫొటో తీసి పంపితే వాటి స్థానంలో సంబంధిత కాంట్రాక్టర్‌తో మంచి గుడ్లను సరఫరా చేయిస్తామన్నారు.
– గజపతినగరం రూరల్

● అంగన్‌వాడీ కేంద్రాలకు కుళ్లిన గుడ్లు