జగ్జీవన్‌రామ్ ఆశయాలను కొనసాగిద్దాం
విజయనగరం అర్బన్: జగ్జీవనర్ రామ్ ఆశయాలను కొనసాగించడమే అసలైన నివాళి అని కలెక్టర్ డాక్టర్ అంబేడ్కర్ అన్నారు. బడుగు బలహీనవర్గాల నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ జయంతిని కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చీపురుపల్లి, వియ్యంపేట డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలల విద్యార్థులు జగ్జీవన్‌రామ్ జీవి త విశేషాలు, ఆయన సాగించిన పోరాటాలు, సాధించిన విజయాలను సాంస్కృతిక ప్రదర్శనల రూపంలో కళ్లకుకట్టారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణించిన గురుకులాల విద్యార్థులను కలెక్టర్ సత్కరించారు. కార్యక్రమంలో జేసీ సేతుమాధవన్, ఎమ్మెల్సీ రఘురాజు, తూర్పుకాపు కార్పొరేషన్ చైర్‌పర్సన్ యశస్విని, డీఆర్‌ఓ శ్రీనివాసమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం
● పోక్సో కేసు నమోదు
లక్కవరపుకోట: మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఐదేళ్ల వయస్సుగల చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పుడిన బాలుడి (15)పై పోక్సో కేసు నమోదు చేసినట్టు విజయనగరం డీఎస్సీ ఎం.శ్రీనివాసరావు శనివారం తెలిపారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో చిన్నారి ఆడుకుంటుండగా బాలుడు వారి ఇంటికి వెళ్లాడు. చిన్నారి తల్లి ఇంటి వెనుక భాగంలో వంట చేసుకుంటుండగా బాలికను ఇంటిలోని మంచంపైకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. చిన్నారి ఏడవడంతో అక్కడి నుంచి జారుకున్నాడు. బాలికను పరిశీలించిన తల్లికి రక్తం చారలు కనిపించడంతో ఎల్.కోట పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఎస్.కోట సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. బాలుడిని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.
జగ్జీవన్‌రామ్ ఆశయాలను కొనసాగిద్దాం


