గ్రంథాలయ వారోత్సవాల షెడ్యూల్‌ ఇదే | - | Sakshi
Sakshi News home page

గ్రంథాలయ వారోత్సవాల షెడ్యూల్‌ ఇదే

Published Sun, Nov 12 2023 12:28 AM | Last Updated on Sun, Nov 12 2023 12:28 AM

షెడ్యూల్‌ విడుదల చేసిన సంఘ ప్రతినిధులు 
 - Sakshi

విజయనగరం అర్బన్‌: జిల్లా గ్రంథాలయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న జాతీయ గ్రంథాలయ వారోత్సవాల షెడ్యూల్‌ను కుసుమ గజపతినగర్‌లోని సంఘ కార్యాలయంలో సంఘం ప్రతినిధులు శనివారం విడుదల చేశారు. తొలిరోజున పట్టణ వీధుల్లో ర్యాలీతో వారోత్సవాలు ప్రారంభంకానున్నాయి. అదేరోజు రాత్రి 7 గంటలకు గురజాడ గ్రంథాలయంలో ‘విద్యార్థులందరూ విజేతలే’ పుస్తక సమీక్ష ఉంటుంది. 15న ఉదయం 10 గంటలకు గురజాడ గ్రంథాలయంలో పుస్తకదాతలు, గ్రాంథాలయ నిర్వాహకులకు సత్కార కార్యక్రమం ఉంటుంది. 16న ఉదయం ఆర్‌అండ్‌బీ కూడలి వద్ద పుస్తక ప్రదర్శన, సగం ధరకు పుస్తకాల అమ్మకం, 17న లక్ష్మీస్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌లో గ్రంథాలయ సదస్సు, 18న ఉదయం 10 గంటలకు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, 19న లంకాపట్నంలో అంబేడ్కర్‌ గ్రంథాలయానికి పుస్తక వితరణ, 20న కాలేజీల్లో గ్రంథాలయ అవగాహన సదస్సులు జరగనున్నవి. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌ రాజు, ప్రధాన కార్యదర్శి కె.దయానంద్‌, వ్యవస్థాపకుడు అబ్దుల్‌ రపూఫ్‌, కోశాధికారి కొత్తలి ఎర్నాయుడు, మాజీ కార్యదర్శి రత్నాల బాలకృష్ణ, ఉపాధ్యక్షుడు ప్రకాశరావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement