నిఘా నిద్రపోతోందా..? | - | Sakshi
Sakshi News home page

నిఘా నిద్రపోతోందా..?

Nov 21 2026 12:32 AM | Updated on Nov 21 2026 12:32 AM

విశాఖలో పెరుగుతున్న మాదకద్రవ్యాల కేసులు గత ఏడాదితో పోలిస్తే ఆరు శాతం అధికం స్థానిక పోలీసుల నిఘా డొల్ల.. టాస్క్‌ఫోర్స్‌పైనే అక్రమ దందాల నియంత్రణ భారం గంజాయి నుంచి ఎండీఎంఏ వరకు విస్తరిస్తున్న మత్తు వ్యాపారం

ద్వారకానగర్‌: నగరంలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల కేసులు పెరుగుతున్నాయి. పోలీసుల నిఘా కళ్లుగప్పి స్మగ్లర్లు తమ కార్యకలాపాలను యథేచ్ఛగా సాగిస్తున్నారు. అయినా స్థానిక పోలీస్‌ స్టేషన్ల సిబ్బంది ఈ వ్యవహారాలపై ఆశించిన స్థాయిలో దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక పోలీసుల నిఘా బలహీనంగా ఉండటంతో టాస్క్‌ఫోర్స్‌పైనే అధిక భారం పడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో శాంతిభద్రతలు, నేరాల నియంత్రణపై పోలీస్‌ శాఖ గురువారం విడుదల చేసిన నివేదికలో మాదకద్రవ్యాల కేసులు గత ఏడాదితో పోలిస్తే ఆరు శాతం పెరిగినట్లు వెల్లడించింది. కమిషనరేట్‌ పరిధిలోని 23 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో మాదకద్రవ్యాల నియంత్రణ చర్యలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అక్టోబర్‌ 1 నుంచి నవంబర్‌ 20 వరకు

టాస్క్‌ఫోర్స్‌ చర్యలు

అక్టోబర్‌ 1 నుంచి నవంబర్‌ 20 వరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వివిధ అక్రమ కార్యకలాపాలపై నిర్వహించిన దాడులు, నమోదు చేసిన కేసులు, అరెస్టులు, స్వాధీనం చేసుకున్న వస్తువుల గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి.

జూదం, బెట్టింగ్‌పై ప్రత్యేక నిఘా

ఆన్‌లైన్‌ జూదం, గేమింగ్‌కు సంబంధించి 89 కేసులు నమోదు చేసి 755 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.39.52 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పేకాటకు సంబంధించి ఆరు కేసుల్లో 54 మందిని, క్రికెట్‌ బెట్టింగ్‌కు సంబంధించి మూడు కేసుల్లో 34 మందిని అరెస్టు చేశారు. ఇతర బెట్టింగ్‌ వ్యవహారాల్లో 10 కేసులు నమోదు చేసి 17 మందిని అరెస్టు చేయడంతోపాటు రూ.8.60 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

మాదకద్రవ్యాలపై దాడులు

గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి 57 కేసులు నమోదు చేసి 121 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 326.47 కిలోల గంజాయి, రూ.19,300 స్వాధీనం చేసుకున్నారు. గంజాయి వినియోగానికి సంబంధించి మరో 15 కేసుల్లో 47 మందిని అరెస్టు చేసి 0.247 కిలోల గంజాయిని పట్టుకున్నారు. హషీష్‌ ఆయిల్‌కు సంబంధించి 24 మందిని అరెస్టు చేసి 41.455 కిలోల ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎండీఎంఏకు సంబంధించి ఎనిమిది కేసుల్లో 16 మందిని అరెస్టు చేసి 75.74 గ్రాముల డ్రగ్‌ను పట్టుకున్నారు. ఎల్‌ఎస్‌డీకి సంబంధించి రెండు కేసుల్లో నలుగురిని అరెస్టు చేసి 51 స్ట్రిప్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఇతర అక్రమ కార్యకలాపాలపైనా నిఘా

ఎకై ్సజ్‌ సంబంధిత వ్యవహారాల్లో 54 కేసులు నమోదు చేసి 60 మందిని అరెస్టు చేశారు. 960.4 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఓట్లు, నకిలీ ఉత్పత్తులకు సంబంధించి నాలుగు కేసులు నమోదు చేసి 17 మందిని అరెస్టు చేశారు. బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఐదు కేసుల్లో ఆరుగురిని అరెస్టు చేసి 6,100 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బొగ్గు అక్రమ రవాణాలో 2,000 కిలోల బొగ్గును పట్టుకున్నారు. పశువుల అక్రమ రవాణా, దొంగతనాలకు సంబంధించి మూడు కేసుల్లో ఆరుగురిని అరెస్టు చేసి 78 ఆవులను స్వాధీనం చేసుకున్నారు. అనుమతుల్లేకుండా బాణాసంచా నిల్వ, విక్రయాలపై 20 కేసులు నమోదు చేసి 22 మందిని అరెస్టు చేశారు. 11,363 పెట్టెల బాణాసంచాను స్వాధీనం చేసుకున్నారు. పెట్రోల్‌ దొంగతనాలకు సంబంధించి రెండు కేసుల్లో నలుగురిని అరెస్టు చేసి 374 లీటర్ల పెట్రోల్‌ను పట్టుకున్నారు. ఆయుధాలు, స్పిరిట్‌, టాబ్లెట్లు, ఇంజక్షన్ల అక్రమ వ్యవహారాల్లోనూ కేసులు నమోదు చేశారు. కోడిపందేలకు సంబంధించి ఆరు కేసుల్లో 54 మందిని అరెస్టు చేసి 21 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement