పీఎన్‌డీటీ చట్టం అమలుకు పటిష్ట చర్యలు | - | Sakshi
Sakshi News home page

పీఎన్‌డీటీ చట్టం అమలుకు పటిష్ట చర్యలు

Nov 21 2026 12:32 AM | Updated on Nov 21 2026 12:32 AM

మహారాణిపేట: జిల్లాలో పీసీ అండ్‌ పీఎన్‌డీటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం. అభిషిక్త్‌ కిషోర్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి మల్టీ మెంబర్‌ అప్రోప్రియేట్‌ అథారిటీ, అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని స్కానింగ్‌ కేంద్రాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి వైద్యుల అర్హతలు, అనుమతులు, రికార్డులను పరిశీలించాలని సూచించారు. పోలీసుల సహకారంతో డెకాయ్‌ ఆపరేషన్లు నిర్వహించి చట్ట ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. స్కానింగ్‌ కేంద్రాల్లో లింగ నిర్ధారణ నేరమని తెలిపే పోస్టర్లను స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రైవేటు స్కానింగ్‌ కేంద్రాలు, క్లినిక్‌లు, ఆసుపత్రుల్లో గర్భిణులకు నిర్వహించే స్కానింగ్‌లలో 5 శాతం ఉచితంగా చేయాలని, ఆ వివరాలను ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేసి వైద్య ఆరోగ్య శాఖకు సమర్పించాలని స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ జి. విద్యాధరి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జగదీశ్వరరావు, ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రభావతి, కేజీహెచ్‌ వైద్యులు, అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement