జనగణనలో ఏ ఒక్కరూ మిస్సవ్వొద్దు | - | Sakshi
Sakshi News home page

జనగణనలో ఏ ఒక్కరూ మిస్సవ్వొద్దు

Nov 21 2026 12:32 AM | Updated on Nov 21 2026 12:32 AM

● ‘సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌’పై విస్తృత ప్రచారం, అవగాహన ● జిల్లా రెవెన్యూ అధికారి అనిత

మహారాణిపేట: జనగణన–2027 రెండో దశ జనాభా గణన ప్రక్రియను అత్యంత బాధ్యతాయుతంగా, నిర్దేశిత గడువులోగా కచ్చితత్వంతో పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌.డి.అనిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సూర్యాబాగ్‌లోని జీవీఎంసీ సౌత్‌ జోన్‌ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులకు నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. నగరంలో జన సాంద్రత ఎక్కువగా ఉన్నందున ఏ ఒక్క కుటుంబం గణన నుంచి తప్పిపోకుండా చూడాలని, ఇళ్లు లేని నిరాశ్రయులను కూడా గణన పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. 2027 జనవరి 10 నుంచి 24 వరకు ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకునేందుకు ‘సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌’ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ విధానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, స్వచ్ఛందంగా వినియోగించుకునేలా ప్రోత్సహించాలన్నారు. జీవీఎంసీ అదనపు కమిషనర్‌ రమేష్‌ మాట్లాడుతూ జనగణనను వందశాతం కచ్చితత్వంతో పూర్తి చేసేందుకు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలన్నారు. ఏ ఒక్క ఇల్లు, వ్యక్తి గణనలో తప్పిపోకుండా, డూప్లికేషన్‌ లేకుండా వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఎన్యూమరేషన్‌ బ్లాకుల విభజన, సిబ్బంది కేటాయింపులను ముందుగానే పూర్తి చేయాలని తెలిపారు.

సెన్సస్‌ డిపార్ట్‌మెంట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌.దయాసాగర్‌ మాట్లాడుతూ జనగణన విజయవంతానికి వివిధ శాఖల సమన్వయం అవసరమన్నారు. జోనల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు డేటా సమర్పణ పూర్తయ్యే వరకు బాధ్యతాయుతంగా వ్యవహరించి కచ్చితమైన వివరాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీవోలు దిలీప్‌ చక్రవర్తి, సంగీత్‌ మాధుర్‌, జీవీఎంసీ సిటీ ఛార్జ్‌ ఆఫీసర్‌, మాస్టర్‌ ట్రైనర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement