కొమ్మాది: ఆక్వాన్ తుపాను ప్రభావం నేపథ్యంలో రుషికొండ బీచ్‌లో గురువారం పర్యాటకుల రాకపోకలను నిలిపివేశారు. ఈదురుగాలులు వీస్తుండటంతోపాటు సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నేపథ్యంలో పర్యాటకుల భద్రత దృష్ట్యా బీచ్‌లోకి ప్రవేశాన్ని నిషేధించినట్లు నిర్వాహకులు తెలిపారు. తుపాను ప్రభావంతో పర్యాటక బోటు షికారు, పారాసెయిలింగ్, పారాగ్లైడింగ్ కార్యకలాపాలను సైతం నిలిపివేశారు. మరోవైపు తీర ప్రాంతాలైన తిమ్మాపురం, మంగమారిపేట, ఉప్పాడకు చెందిన మత్స్యకారులు చేపల వేటకు విరామం పలికారు. బోట్లు, వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకున్నారు.


