మల్కాపురం: గాజువాక ఆర్టీసీ డిపో వద్ద గ్రీన్ మెట్రో ఏసీ బస్సులను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.శివప్రసాద్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రానికి సుమారు 1,050 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో విశాఖకు సుమారు 100 బస్సులు కేటాయించగా, ఇప్పటికే 50 బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల వల్ల కాలుష్య సమస్య ఉండదని, ఇంధన వ్యయం కూడా తగ్గుతుందని వివరించారు. ఈ బస్సులకు సీ్త్ర శక్తి పథకం కూడా వర్తిస్తుందని తెలిపారు.


