కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా నగరంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని శివుడికి అభి
షేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో దీపారాధనలు చేశారు. ఆర్.కె.నగర్ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, రేసపువానిపాలెం శివాలయం, ఎంవీపీ కాలనీ సెక్టార్–6లోని జ్యోతిర్లింగ శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది.
– ఫొటోలు, సాక్షి, ఫొటోగ్రాఫర్


