పూర్ణా మార్కెట్‌కు నాగులచవితి కళ | - | Sakshi
Sakshi News home page

పూర్ణా మార్కెట్‌కు నాగులచవితి కళ

Nov 13 2026 8:39 AM | Updated on Nov 13 2026 8:39 AM

జగదాంబ: నాగుల చవితి పర్వదినం నేపథ్యంలో పూర్ణా మార్కెట్‌లో సందడి నెలకొంది. శుక్రవారం చవితి కావడంతో గురువారమే నగరవాసులు పెద్ద సంఖ్యలో మార్కెట్‌కు చేరుకుని పూజా సామగ్రి, పండ్లు, పూల కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. తాటితేగలు, తాటి టెంకాయలు, చెరుకులు, నువ్వులు, బెల్లం, నాగుల పంచెలు, కలకూరలు తదితర వస్తువులన్నీ పూర్ణామార్కెట్‌లో అందుబాటులో ఉండటంతో అధిక సంఖ్యలో కొనుగోలుదారులు చేరుకోవడంతో మార్కెట్‌ కిటకిటలాడిపోయింది. కొనుగోలుదారుల రద్దీతో వ్యాపారాలు జోరందుకున్నాయి. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు ధరలు పెంచడంతో అరటిపండ్లు, పూలు, కొబ్బరికాయల ధరలు అధికంగా పలికాయి. పూజా సామగ్రి ధరలు మాత్రం అందుబాటులో ఉన్నాయని కొనుగోలుదారులు తెలిపారు. కొబ్బరికాయల ధరలు ఆకాశన్నంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement