మహారాణిపేట: గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈ నెల 13, 14 తేదీల్లో విశాఖలో పర్యటించనున్నారు. ఈ నెల 13న మధ్యాహ్నం 3 గంటలకు విశాఖలోని ఐఎన్‌ఎస్ డేగా విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 3.15 గంటలకు భారత ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్‌కు స్వాగతం పలుకుతారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చేరుకుని సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు నిర్వహించే 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం ముగిసిన అనంతరం సాయంత్రం 5.35 గంటలకు ఐఎన్‌ఎస్ డేగా విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతికి వీడ్కోలు పలికి, తిరిగి నోవోటెల్ వరుణ్ బీచ్‌కు చేరుకుంటారు. ఈ నెల 14న ఉదయం 5.25 గంటలకు నోవోటెల్ నుంచి బయలుదేరి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని తిరుగు ప్రయాణం కానున్నారు.


