బాధితురాలికి బంగారు వస్తువులు అప్పగింత | - | Sakshi
Sakshi News home page

బాధితురాలికి బంగారు వస్తువులు అప్పగింత

Nov 10 2026 12:25 AM | Updated on Nov 10 2026 12:25 AM

కంకిపాడు: ఆటోలో మాయమైన బంగారు వస్తువులను ఎట్టకేలకు బాధితురాలికి అప్పగించారు. కంకిపాడు ఎస్‌ఐ కేవై దాసు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నంకు చెందిన అద్దంకి భాగ్యలక్ష్మి ఈనెల 6వ తేదీ 12 గంటల సమయంలో విజయవాడ రైల్వేస్టేషన్‌లో దిగి అక్కడి నుంచి దుర్గమ్మ దర్శనానికి వెళ్లారు. అక్కడి నుంచి ఈడుపుగల్లులోని అత్తగారింటికి వెళ్లి తిరిగి సొంత ఊరుకి బయలుదేరేందుకు గోసాల సెంటరులో ఆటో ఎక్కారు. తన వెంట ఉన్న బ్యాగులో ఒక తులం బంగారు గాజులు, ఒక తులం బంగారు మాల, రెండు మురుగులు భద్రపరుచుకున్నారు. విజయవాడ రైల్వేస్టేషన్‌ వద్ద ఆటో దిగే సమయంలో బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును ఆటోలో మర్చిపోయారు. ఆభరణాలు కనిపించకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేకంగా విచారణ చేశారు. ఆటోలోనే బంగారు ఆభరణాలను మర్చిపోయినట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాధితురాలు భాగ్యలక్ష్మికి అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement