కూటమి కుయుక్తులతో అడ్డగోలు గెలుపు | - | Sakshi
Sakshi News home page

కూటమి కుయుక్తులతో అడ్డగోలు గెలుపు

Nov 8 2026 12:43 AM | Updated on Nov 8 2026 12:43 AM

అధికార మదంతో బెదిరింపులు.. ప్రలోభాలు చివరి రౌండ్‌ వరకూ హోరాహోరీగా పరిషత్‌ పోరు స్వల్ప మెజారిటీలతో గట్టెక్కిన కూటమి జెడ్పీటీసీ అభ్యర్థులు అధికార పార్టీ అరాచకాలను ధీటుగా ఎదుర్కొన్న వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీల్లో టీడీపీ 29, జనసేన 7,

పెదగాడి ఎంపీటీసీ స్థానం జనసేన ఏకగ్రీవం

మండలం గెలిచింది మెజారిటీ

ఆనందపురం జనసేన 1557

పెందుర్తి టీడీపీ 4139

భీమిలి టీడీపీ 3110

పద్మనాభం టీడీపీ 1415

జెడ్పీటీసీ సభ్యులు

ఎంపీటీసీలు..

మండలం వైఎస్సార్‌సీపీ టీడీపీ జనసేన బీజేపీ

ఆనందపురం(17) 7 6 4 0

భీమునిపట్నం(12) 2 9 1 0

పద్మనాభం(15) 4 11 0 0

పెందుర్తి(9) 3 3 3 0

మొత్తం(53) 16 29 8 0

సాక్షి, విశాఖపట్నం: స్థానిక సంస్థల పరిషత్‌ ఎన్నికల్లో కూటమి పార్టీలు అధికార దుర్వినియోగానికి పాల్పడి అడ్డగోలుగా విజయం సాధించాయి. అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం, విచ్చలవిడిగా డబ్బు, మద్యం ప్రలోభాలకు తెరలేపడం, కొన్ని చోట్ల రిగ్గింగ్‌లకు పాల్పడటం ద్వారా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను చేజిక్కించుకున్నాయి. ప్రలోభాలు, బెదిరింపులతో ఎన్నికల ప్రక్రియను ప్రహసనంగా మార్చినప్పటికీ.. అధికారపక్ష అరాచకాలను వైఎస్సార్‌సీపీ అంతే ధీటుగా ఎదుర్కొని చివరి వరకూ హోరాహోరీ పోటీ ఇచ్చింది.

జెడ్పీటీసీల్లో నెగ్గుకొచ్చిన కూటమి

జిల్లాలోని నాలుగు జెడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగింది. తొలి మూడు రౌండ్లు ముగిసే సమయానికి ఇరు పక్షాల మధ్య ఓట్ల వ్యత్యాసం స్వల్పంగానే ఉంది. ము ఖ్యంగా ఆనందపురం, పెందుర్తి జెడ్పీటీసీ స్థానాల్లో రౌండ్‌ రౌండ్‌కూ ఆధిక్యం మారుతూ పోటీ నువ్వానేనా అన్నట్లు సాగింది. చివరి రౌండ్‌లో కూటమి అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో విజ యం సాధించారు. పద్మనాభం, భీమిలి స్థానాల్లో మాత్రం చివ రి రెండు రౌండ్లలో కూటమి అభ్యర్థులు ఆధిక్యం సాధించారు.

ఎంపీటీసీల్లో హోరాహోరీ సమరం

మొత్తం 53 ఎంపీటీసీ స్థానాలకుగాను 52 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో వైఎస్సార్‌సీపీ 16 స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ 29, జనసేన 7 స్థానాలను గెలుచుకున్నాయి. పెందుర్తి మండలం పెదగాడి ఎంపీటీసీ స్థానం జనసేనకు ఏకగ్రీవం అయింది. దీంతో జనసేన 8 స్థానాలు గెలుచుకున్నట్లయింది. పలు స్థానాల్లో స్వల్ప ఓట్ల తేడాతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. కొన్ని చోట్ల చెల్లని ఓట్లపై అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆనందపురం మండలంలో వైఎస్సార్‌సీపీ అత్యధికంగా 8 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటింది. గంభీరం ఎంపీటీసీ స్థానంలో తొలుత 36 ఓట్ల మెజారిటీతో వైఎస్సార్‌సీపీ గెలిచినట్లు తేలినా.. నాలుగుసార్లు రీకౌంటింగ్‌ నిర్వహించిన అనంతరం నాలుగు ఓట్ల ఆధిక్యంతో కూటమి అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. ఫలితాన్ని వెంటనే ప్రకటించకుండా రాత్రి 9 గంటల వరకు జాప్యం చేశారని పేర్కొన్నారు.

వైఎస్సార్‌సీపీ గెలిచిన ఎంపీటీసీ స్థానాలు

ఆనందపురం మండలంలో ఆనందపురం–1, ఆనందపురం–2, గొట్టిపల్లి, కుసులవాడ, గిడిజాల, మామిడిలోవ, శొంఠ్యాం స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. పద్మనాభం మండలంలో పాండ్రంగి–2, అనంతవరం, గంధవరం, రెడ్డిపల్లి స్థానాలను కై వసం చేసుకుంది. పెందుర్తి మండలంలో సరిపల్లి, గుర్రంపాలెం, రాజయ్యపేట, భీమిలి మండలంలో చిప్పాడ, మజ్జిపేట స్థానాల్లో గెలుపొందింది.

వైఎస్సార్‌సీపీ 16 చోట్ల విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement