మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
భీమునిపట్నం: భీమిలి బీచ్ రోడ్డులోని ఐఎన్ఎస్ కళింగ సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. విశాఖ నుంచి భీమిలి వైపు నలుగురు విద్యార్థులు కారులో వేగంగా వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న లోతైన ప్రాంతంలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గీతం కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్న భవేశ్ (19) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న అతని స్నేహితులు శ్యాంసుందర్, శ్రీమంత్ యాదవ్, వెంకట్‌కు గాయాలయ్యాయి. వెంటనే వారిని భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు పంపించారు.


