నేడే | - | Sakshi
Sakshi News home page

నేడే

Nov 7 2026 1:30 AM | Updated on Nov 7 2026 1:30 AM

కౌంటింగ్‌ ఏర్పాట్లు

పరిషత్‌ తీర్పు

భీమిలి సెడార్‌ స్కూల్‌లో

సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. పెందుర్తి, పద్మనాభం, ఆనందపురం, భీమిలి మండలాల్లో నిర్వహించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠకు శనివారంతో తెరపడనుంది. ఉదయం 8 గంటల నుంచే లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుండగా, అధికారులు మూడు ప్రధాన కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. నాలుగు మండలాల్లో మొత్తం 78 కౌంటింగ్‌ టేబుళ్లను ఏర్పాటు చేశారు.

ఆనందపురం మండలంలో ఎంపీడీవో కార్యాలయ నూతన సమావేశ మందిరంలో 20 టేబుళ్లు, భీమిలిలోని సెడార్‌ పాఠశాల గ్రౌండ్‌ ఫ్లోర్‌ హాల్‌లో 20 టేబుళ్లు, అదే పాఠశాల మొదటి అంతస్తు హాల్‌లో పద్మనాభం ఓట్ల లెక్కింపు కోసం 20 టేబుళ్లు, పెందుర్తి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల డైనింగ్‌ హాల్‌లో 18 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 53 ఎంపీటీసీ, 4 జెడ్పీటీసీ సెగ్మెంట్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. పెందుర్తి మండలంలోని పెదగాడి ఎంపీటీసీ సెగ్మెంట్‌ ఏకగ్రీవమైన నేపథ్యంలో మిగిలిన సెగ్మెంట్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. కౌంటింగ్‌ ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే కలెక్టర్‌ ఎం. అభిషిక్త్‌ కిశోర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడంతో పాటు, లెక్కింపు ప్రక్రియ నిర్వహణపై సిబ్బందికి ఆయా కౌంటింగ్‌ కేంద్రాల పరిధిలో శిక్షణలు కూడా అందజేశారు.

82.51 శాతం పోలింగ్‌.. 1.34 లక్షల ఓట్లు

విశాఖ రూరల్‌ పరిధిలోని ఈ నాలుగు మండలాల్లో మొత్తం 4 జెడ్పీటీసీ, 52 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. 203 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో రికార్డు స్థాయిలో 82.51 శాతం మంది (మొత్తం 1,34,000 మంది) ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. బరిలో నిలిచిన 13 మంది జెడ్పీటీసీ, 117 మంది ఎంపీటీసీ అభ్యర్థుల భవితవ్యం నేటి లెక్కింపుతో తేలనుంది. పెందుర్తి మండలంలోని పెదగాడి ఎంపీటీసీ సెగ్మెంట్‌ ఇప్పటికే ఏకగ్రీవమైనందున, మిగిలిన 53 ఎంపీటీసీ, 4 జెడ్పీటీసీ సెగ్మెంట్ల ఫలితాలను వెల్లడించనున్నారు.

తొలి ఫలితం ఎక్కడంటే..

కౌంటింగ్‌ ప్రక్రియలో భాగంగా అధికారులు మొదట ఎంపీటీసీ ఫలితాలను, ఆ తర్వాత జెడ్పీటీసీ ఫలితాలను ప్రకటిస్తారు. ఎంపీటీసీ విభాగంలో గంధవరం, సింగనబంధ సెగ్మెంట్లలోనే తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. అలాగే జెడ్పీటీసీ స్థానాల్లో పద్మనాభం సెగ్మెంట్‌ తొలి ఫలితం రానుంది.

3 కేంద్రాలు.. 78 టేబుళ్లు..

355 మంది సిబ్బంది

నాలుగు మండలాల ఓట్ల లెక్కింపు కోసం అధికారులు మొత్తం 3 చోట్ల 78 టేబుళ్లను అందుబాటులోకి తెచ్చారు. లెక్కింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు 355 మంది కౌంటింగ్‌ సిబ్బందిని రంగంలోకి దించుతున్నారు.

ఎక్కడికక్కడే కౌంటింగ్‌ కేంద్రాలు

● ఆనందపురం మండల ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్థానిక ఎంపీడీవో కార్యాలయ నూతన సమావేశ మందిరంలో జరుగుతుంది.

● పెందుర్తి మండల ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల డైనింగ్‌ హాలులో ఉంటుంది.

● పద్మనాభం, భీమునిపట్నం మండల ఓట్ల లెక్కింపు భీమిలిలోని సెడార్‌ పాఠశాల గ్రౌండ్‌ ఫ్లోర్‌ – మొదటి అంతస్తు హాల్‌లో నిర్వహిస్తారు.

జిల్లాలో మూడు చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్‌ ప్రారంభం తొలుత ఎంపీటీసీ, తరువాత జెడ్పీటీసీ ఫలితాలు గంధవరం, సింగనబంధ ఎంపీటీసీ సెగ్మెంట్లలోనే తొలి ఫలితం జెడ్పీటీసీల్లో తొలి ఫలితం పద్మనాభం సెగ్మెంట్‌ 78 కౌంటింగ్‌ టేబుళ్ల ఏర్పాటు 52 ఎంపీటీసీ, 4 జెడ్పీటీసీ సెగ్మెంట్ల ఫలితాల వెల్లడి జిల్లాలో 4 జెడ్పీటీసీ, 52 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన పోలింగ్‌

ఎన్నికల నిర్వహణకు అరకొర నిధులు

మహారాణిపేట: పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు అరకొర బడ్జెట్‌ విడుదల కావడంతో అధికార యంత్రాంగం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. జిల్లాలోని నాలుగు మండలాల్లో జెడ్పీటీసీ, 53 ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించగా, శనివారం ఓట్ల లెక్కింపు జరగనుంది. జిల్లాలో పరిషత్‌ ఎన్నికల ప్రక్రియకు మొత్తం రూ.1.50 కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే ప్రభుత్వం రూ.80 లక్షలు మాత్రమే విడుదల చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ నిధులు ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న సిబ్బంది ఖర్చులు, ఇతర అవసరాలకు పూర్తిగా ఖర్చయిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేతిలో నిధులు లేక శనివారం జరిగే ఓట్ల లెక్కింపు నిర్వహణపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. మూడు కేంద్రాల్లో లెక్కింపు చేపట్టనుండగా, అక్కడికి వచ్చే సిబ్బందికి భోజనాలు, ఇతర ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అలాగే లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి టీఏ, డీఏలు చెల్లించాల్సి ఉండటంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement