విద్యార్థుల సమస్యలపై వర్సిటీ నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సమస్యలపై వర్సిటీ నిర్లక్ష్యం

Nov 7 2026 1:30 AM | Updated on Nov 7 2026 1:30 AM

విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతున్న విద్యార్థులకు సమాధానం చెప్పాల్సిన అధికారులు నోటీసులు జారీ చేస్తూ భయభ్రాంతులకు గురిచేయాలని చూడటం సిగ్గుచేటని మండిపడ్డారు. శుక్రవారం ఏయూ వీసీ కార్యాలయం ఎదుట నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ విశాఖ జిల్లా అధ్యక్షుడు సాయితేజ మాట్లాడుతూ విద్యార్థుల నుంచి వివిధ రకాల ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యం కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతోందని విమర్శించారు. జిల్లా కార్యదర్శి జి.అజయ్‌ మాట్లాడుతూ వర్సిటీలో అనేక విభాగాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో యాజమాన్యం చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీసీ, అధికారులు విద్యార్థి సంఘాలతో తక్షణమే చర్చలు జరిపి, ప్రతి సమస్య పరిష్కారానికి కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థి నాయకులకు జారీ చేసిన నోటీసులు ఉపసంహరించుకునే వరకు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏయూ విభాగం ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి కుసుమాంజలి, యూనివర్సిటీ ఉపాధ్యక్షులు ప్రగతి, సంజయ్‌, విశాల్‌, దోహిత్‌, నిఖిల్‌, సాగర్‌తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement