సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

Oct 26 2026 7:18 AM | Updated on Oct 26 2026 7:18 AM

సైబర్‌ భద్రతపై అవగాహన సదస్సులో సీపీ బాగ్చి

ద్వారకానగర్‌: డిజిటల్‌ అరెస్ట్‌లు, స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులు, కేవైసీ పేరుతో సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి సూచించారు. తిమ్మాపురంలోని విజ్ఞాన్స్‌ వరల్డ్‌ వన్‌ పాఠశాలలో ఆదివారం విశాఖ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌ (వీసీఎస్సీ), సీఐఐ యంగ్‌ ఇండియన్స్‌ సంయుక్తంగా నిర్వహించిన సైబర్‌ భద్రత అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. సైబర్‌ నేరగాళ్లు పోలీస్‌, ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఆన్‌లైన్‌ లావాదేవీలు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, సైబర్‌ మోసానికి గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు. అనంతరం నిర్వహించిన ప్యానెల్‌ చర్చలో అడ్వకేట్‌ వివేక్‌ గుప్తా, సైకియాట్రీ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ నివేదిత వాసిరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వహణకు సహకరించిన పాఠశాల ప్రిన్సిపాల్‌ కె.పూర్ణిమ, సీఐఐ యంగ్‌ ఇండియన్స్‌ చైర్‌పర్సన్‌ దీపా కొడాలి, వైస్‌ చైర్‌పర్సన్‌ సాయి సుప్రియలను వీసీఎస్సీ అభినందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement