పెదగంట్యాడ : స్వదేశీ దంత వైద్య సాంకేతికతను ప్రోత్సహించే లక్ష్యంతో ఏఎంటీజెడ్‌లో ఆదివారం డెంటల్ హ్యాకథాన్ నిర్వహించారు. 15 స్టార్టప్ బృందాలు తమ వినూత్న ఆవిష్కరణలను ప్రదర్శించగా, పరిశ్రమ నిపుణులతో చర్చలు జరిపాయి. కార్యక్రమాన్ని ఏఎంటీజెడ్ సీఈవో జితేంద్ర శర్మ, డెంటిక్ వరల్డ్ సీఈవో కృష్ణసాయి ప్రారంభించారు. ఈ సందర్భంగా డెంటల్ టెక్నాలజీల అభివృద్ధి, తయారీ, వాణిజ్యీకరణపై చర్చించడంతో పాటు పలు స్టార్టప్‌ల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరాయి. డాక్టర్ పి హరికృష్ణ, సతీష్ గోఖలే, డాక్టర్ స్టీవెన్, డాక్టర్ సందీప్ సీసాలత,, డాక్టర్ కృష్ణసాయి, డాక్టర్ కవిత తదితరులు పాల్గొన్నారు.


