సింథియా: ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా దేశాల నౌకాదళాలతో కలిసి క్వాడ్ సముద్ర పరిశీలన మిషన్‌లో పాల్గొనేందుకు ఇండియన్ కోస్ట్‌గార్డ్ నౌక ఐసీజీఎస్ షౌనక్ ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు చేరుకుంది. ఈ మిషన్ ద్వారా నాలుగు దేశాల మధ్య సముద్ర భద్రతకు సంబంధించిన సమన్వయం, ఉత్తమ విధానాల పరస్పర మార్పిడి మరింత బలోపేతం కానుంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రతను పెంపొందించడంతోపాటు, స్వేచ్ఛాయుత, బహిరంగ, నియమాల ఆధారిత సముద్ర వ్యవస్థను కొనసాగించడమే లక్ష్యంగా ఈ మిషన్‌ను నిర్వహిస్తున్నట్లు నేవీ వర్గాలు తెలిపాయి. మహాసాగర్ దృష్టికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.


