ప్రేమ విఫలం.. బీటెక్‌ విద్యార్థి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలం.. బీటెక్‌ విద్యార్థి బలవన్మరణం

Oct 8 2026 3:54 AM | Updated on Oct 8 2026 3:54 AM

మధురవాడ: ‘ఒక్కరు నా హృదయంతో ఆడుకున్నారు. అమ్మా.. నాన్నా.. అక్కా క్షమించండి’ అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి బీటెక్‌ విద్యార్థి బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. పీఎంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా నిజాంపట్నం ఫిషర్‌మెన్‌ కాలనీకి చెందిన కర్రి జ్ఞానేశ్‌వర్మ (19) పీఎంపాలెంలోని బాబా ఇంజినీరింగ్‌ కళాశాలలో సీఈసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. హాస్టల్‌ నచ్చకపోవడంతో 10 రోజుల క్రితం మిథిలాపురి వుడా కాలనీలోని రాచకొండ అపార్ట్‌మెంట్‌లో ఓ ప్లాట్‌కు మారాడు. బుధవారం ఫ్లాట్‌ నుంచి దుర్వాసన రావడంతో వాచ్‌మెన్‌ అయిన మహిళ స్థానికులకు సమాచారం ఇచ్చింది. వారు తలుపులు తెరిచి చూడగా జ్వానేశ్‌వర్మ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో సుమారు ఐదు రోజుల క్రితమే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు పీఎంపాలెం పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement